USA Box Office: సీతారామం, బింబిసార.. మొదటి వారం కలెక్షన్స్ ఎంతంటే..

ABN , First Publish Date - 2022-08-13T03:07:43+05:30 IST

విడుదలై వారం రోజులైన అగ్రరాజ్యం అమెరికాలో దక్షిణాది సినిమాల మానియా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ‘సీతారామం’, ‘బింబిసార’ సినిమాలు.. భారీ మొత్తంలో కలెక్షన్లు రా

USA Box Office: సీతారామం, బింబిసార.. మొదటి వారం కలెక్షన్స్ ఎంతంటే..

ఓవర్సీస్ సినిమా: విడుదలై వారం రోజులైన అగ్రరాజ్యం అమెరికాలో దక్షిణాది సినిమాల మానియా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ‘సీతారామం’, ‘బింబిసార’ సినిమాలు.. భారీ మొత్తంలో కలెక్షన్లు రాబడుతున్నాయి. ఘన విజయంతో రెండు సినిమాలూ రెండో వారంలోకి అడుగుపెట్టాయి. గురువారం రోజు ‘సీతారామం’ అమెరికాలోని 151 లొకేషన్లలో ప్లై అయి.. 24,491 డాలర్లు వసూలు చేసింది. ఇదే సమయంలో ‘బింబిసార’ మూవీ.. 87లొకేషన్లలో ప్లే అయి... 11,877 డాలర్లు రాబట్టింది. దీంతో అమెరికాలోనే ‘సీతారామం’ వసూళ్లు(Sitaramam Collections) 8,50,439 డాలర్ల(సుమారు రూ.6.77కోట్లు)కు చేరింది. ఇక పోతే ‘బింబిసార’ మూవీ వారం రోజుల్లో(Bimbisara Collections) 4,54,066 డాలర్లు(దాదాపు రూ.3.61కోట్లు) వసూలు చేసింది. 


Updated Date - 2022-08-13T03:07:43+05:30 IST