Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 21 Jan 2022 14:28:18 IST

‘ఆచార్య’ రిలీజ్ డేట్లో ‘బింబిసార’ ?

twitter-iconwatsapp-iconfb-icon
ఆచార్య రిలీజ్ డేట్లో బింబిసార ?

‘ఎంతమంచి వాడవురా’ చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న సోషియో హిస్టారికల్ చిత్రం ‘బింబిసార’. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి  మల్లిడి వశిష్ట్ దర్శకుడు. టైమ్ ట్రావెల్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా టీజర్ మొన్నామధ్య విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో కేథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా విడుదలవుందని వార్తలొచ్చాయి కానీ.. అప్పటికింకా సినిమా పూర్తి కాకపోవడంతో విడుదల కాలేకపోయింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


‘బింబిసార’ చిత్రాన్ని  మెగాస్టార్ ‘ఆచార్య’ ను విడుదల చేయాలనుకున్న ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నారని టాక్.  కరోనా కారణంగా ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ 1కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. బింబిసార చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో మొదటి భాగం ఫిబ్రవరి 4న విడుదల కానున్నట్టు తెలుస్తోంది. మొదటి భాగం విడుదలయ్యాకనే సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రారంభమవుతుందట. ‘మగధీర’ తరహాలోని ఆసక్తికరమైన నేపథ్యంతో వస్తున్న ‘బింబిసార’ కళ్యాణ్ రామ్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement