ఆ ఇద్దరి కంటే... గేట్స్ సంపదే ఎక్కువ

ABN , First Publish Date - 2021-11-09T05:30:00+05:30 IST

ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్... తన విద్యుత్తు కార్ల కంపెనీలో వాటాలను పూర్తిగా అట్టిపెట్టుకోవడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

ఆ ఇద్దరి కంటే... గేట్స్ సంపదే ఎక్కువ

న్యూయార్క్ : ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్... తన విద్యుత్తు కార్ల కంపెనీలో వాటాలను పూర్తిగా అట్టిపెట్టుకోవడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పన్నుల నుండి తప్పించుకునేందుకు షేర్ల వ్యాల్యూ పెరిగినప్పటికీ, స్టాక్స్‌ను విక్రయించి లాభాలు స్వీకరించడం లేదనే వారు కూడా ఉన్నారు. ఈ నేపధ్యంలో బిల్ గేట్స్ విషయం చర్చకు వస్తోంది. ఎలాన్ మస్క్ మాదిరిగానే... మైక్రోసాఫ్ట్‌లో తన స్టాక్స్ అన్నింటిని అట్టిపెట్టుకుంటే బిల్ గేట్స్ ఇప్పుడు ప్రపంచ కుబేరుడు కావడంతో పాటు ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉన్న ఒకటి, రెండు స్థానాల కంటే ఎక్కువ మొత్తం ఆయన వద్ద ఉండేదని చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ కార్ప్‌లో బిల్ గేట్స్ స్టాక్స్ అలాగే ఉంటే... ఎలాన్ మస్క్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్... ఈ ఇద్దరి సంపద కంటే ఆయన వద్ద ఎక్కువగా ఉండేది.


ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1998 లో వరల్డ్ మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీగా నిలిచింది. అప్పుడు బిల్‌గేట్స్ వద్ద 2.06 బిలియన్ డాలర్ల షేర్లు ఉన్నాయి. మళ్లీ ఇటీవలే అక్టోబరు 29 న మైక్రోసాఫ్ట్ కంపెనీ... ఆపిల్ ఇంక్‌ను దాటి ప్రపంచ నెంబర్ వన్ కంపెనీగా నిలిచింది. అంటే బిల్‌గేట్స్ వద్ద 1998 నాటి 2.06 బిలియన్ డాలర్ల షేర్లు అలాగే ఉంటే కనుక ప్రస్తుతం ఆయన సంపద 693 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఎలాన్ మస్క్ సంపద ఇప్పుడు 340.4 బిలియన్ డాలర్లు. జెఫ్ బెజోస్ నెట్‌వర్త్ 200.3 బిలియన్ డాలర్లు. వీరిద్దరి నెట్‌వర్త్ కలిసినా(340+200) 540 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే ప్రస్తుతం బిల్‌గేట్స్ షేర్లు అలాగే ఉంటే, వీరిద్దరి సంపద కంటే ఎక్కువగా ఉండేది. గతేడాది(2020 లో) మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి తప్పుకునే సమయంలో ఆయన మెజార్టీ షేర్లను విక్రయించారన్న విషయం తెలిసిందే. నిరుడు మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి వైదొలిగిన సందర్భంగా బిల్‌గేట్స్ ఆయన ఖాతాలోని మెజార్టీ వాటాలను విక్రయించారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్న దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి సారించేందుకే వైదొలుగుతున్నట్లు గేట్స్ అప్పుడు ప్రకటించారు. ఆ తర్వాత ఆయనపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో భార్య మిలిందా గేట్స్‌కు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత... స్పేస్ఎక్స్, టెస్లాతో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ సంపాదించుకున్నారు. ప్రస్తుతం అత్యంత ధనవంతుల జాబితాలో గేట్స్ తొలి స్థానంలో ఉన్నారు. ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా అవతరించే అవకాశముందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-11-09T05:30:00+05:30 IST