Green Card: యూఎస్ కాంగ్రెస్‌లో కీల‌క‌ బిల్లు.. భారత ఐటీ నిపుణుల‌కు మేలు!

ABN , First Publish Date - 2021-06-03T19:38:21+05:30 IST

అమెరికా కాంగ్రెస్‌లో మ‌రో కీల‌క బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌బ‌డింది. ప్ర‌స్తుతం గ్రీన్​కార్డుల జారీలో దేశాల వారీగా ఉన్న కోటాను(కంట్రీ క్యాప్‌-7శాతం) తొలగించాలంటూ ఇద్దరు కాంగ్రెస్​సభ్యులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

Green Card: యూఎస్ కాంగ్రెస్‌లో కీల‌క‌ బిల్లు.. భారత ఐటీ నిపుణుల‌కు మేలు!

వాషింగ్ట‌న్‌: అమెరికా కాంగ్రెస్‌లో మ‌రో కీల‌క బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌బ‌డింది. ప్ర‌స్తుతం గ్రీన్​కార్డుల జారీలో దేశాల వారీగా ఉన్న కోటాను(కంట్రీ క్యాప్‌-7శాతం) తొలగించాలంటూ ఇద్దరు కాంగ్రెస్​సభ్యులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాసైతే మాత్రం దశాబ్దాల తరబడి గ్రీన్​కార్డుల కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది భారతీయ ఐటీ నిపుణుల‌కు మేలు జ‌రుగుతుంది. కాగా, గ్రీన్​కార్డుల జారీలో సమానత్వం తీసుకురావాల‌నే ఏకైక ఉద్దేశంతో '2021 ఈక్వల్​ యాక్సెస్ ​టు గ్రీన్​కార్డ్స్​ ఫర్​ లీగల్​ ఎంప్లాయిమెంట్​(ఈఏజీఎల్​ఈ)'-'ఈగ‌ల్ యాక్ట్' పేరిట ఈ బిల్లును కాంగ్రెస్​ సభ్యులు జో లఫ్​గ్రెన్​, జాన్​ కర్టిస్ తాజాగా అమెరికా ప్ర‌తినిధుల స‌భ‌లో​ ప్రవేశపెట్టారు. అలాగే కుటుంబ ఆధారిత వీసాలపై ఉన్న పరిమితిని కూడా 15 శాతానికి పెంచాలని బిల్లులో పేర్కొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా దెబ్బతిన్న యూఎస్ వ‌ల‌సల‌ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌నం చేసేందుకు ఇదే స‌రియైన స‌మ‌యమ‌ని ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్​ సభ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. 


ఇక ప్ర‌స్తుతం గ్రీన్​కార్డుల జారీలో అనుస‌రిస్తున్న‌ దేశాల వారీ ప‌రిమితి(కంట్రీ క్యాప్‌-7శాతం) అనేది 1990లో తీసుకొచ్చింద‌ని, దీనిద్వారా అధిక జ‌నాభా ఉన్న దేశాల‌కు, త‌క్కువ జ‌నాభా ఉన్న దేశాల‌కు ఒకే విధంగా గ్రీన్​కార్డులు ఇస్తే సమానత్వం లోపిస్తుందని కాంగ్రెస్​ సభ్యులు అన్నారు. దాంతో అధిక జనాభాలోని మంచి నైపుణ్యం ఉన్నవారికి అవకాశం దక్కడం లేదని కాంగ్రెస్ స‌భ్యులు జో లఫ్​గ్రెన్​ తెలిపారు. ఫ‌లితంగా మెరుగైన నైపుణ్యం గ‌ల వారు ఇత‌ర దేశాల‌కు త‌ర‌లిపోతున్నార‌ని అన్నారు. ఇది అమెరికా ఆర్థికవ్యవస్థపై తీవ్ర‌ ప్రభావం చూపుతుందని కాంగ్రెస్​ సభ్యులు పేర్కొన్నారు. క‌నుక ఈ దేశాల వారీ ప‌రిమితిని పూర్తిగా ఎత్తివేయాలంటూ తాజాగా 'ఈగ‌ల్ యాక్ట్' బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బిల్లు గట్టెక్కితే గ్రీన్​కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎంతోమంది భారతీయ ఐటీ నిపుణుల నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డిన‌ట్టే.     

Updated Date - 2021-06-03T19:38:21+05:30 IST