భార్య గురించి స్నేహితులతో బిల్‌గేట్స్ ఏమ‌న్నారంటే..

ABN , First Publish Date - 2021-05-14T13:37:59+05:30 IST

ఏవరైనా త మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాలను తొలుత స్నేహితులనే పంచుకుంటారని చెబుతుంటారు.

భార్య గురించి స్నేహితులతో బిల్‌గేట్స్ ఏమ‌న్నారంటే..

ప్రేమరహితంగా నా వైవాహిక జీవితం

న్యూఢిల్లీ: ఏవరైనా త మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాలను తొలుత స్నేహితులనే పంచుకుంటారని చెబుతుంటారు. ఇందుకు బిల్‌గేట్స్‌ కూడా మినహాయింపుకాదు. ఆయన, తన భార్య మెలిండాతో విడిపోయిన సంగతి తెలిసిందే కదా! అయితే ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెళ్లడించక ముందు తన స్నేహితులతో పంచుకున్నారట. తన వైవాహిక జీవితం ప్రేమ రహితంగా మిగిలిపోయిందని, తాము వేర్వేరుగా ఉంటున్నామని వారితో ఆయన చెప్పుకొన్నారట. హవాయ్‌లోని గోల్ఫ్‌కోర్స్‌లోని తన మి త్రులతో బిల్‌గేట్స్‌ మాట్లాడినట్లుగా న్యూయార్క్‌ పోస్ట్‌ పేర్కొంది. విడాకుల విషయం ఎక్కడ చెప్పుకొన్నారో.. 27 ఏళ్ల క్రితం ఆ గోల్ఫ్‌కోర్టు సాక్షిగానే ఆమెను బిల్‌ పెళ్లాడటం గమనార్హం.  

Updated Date - 2021-05-14T13:37:59+05:30 IST