మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు Bill Gatesకు కొవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2022-05-11T13:09:42+05:30 IST

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా కొవిడ్ -19 బారిన పడ్డారు...

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు Bill Gatesకు కొవిడ్ పాజిటివ్

సీటెల్(అమెరికా): మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా కొవిడ్ -19 బారిన పడ్డారు. తనకు కరోనా తేలికపాటి లక్షణాలున్నాయని బిల్ గేట్స్ చెప్పారు. తాను మళ్లీ ఆరోగ్యంగా ఉండే వరకు తాను ఐసోలేషన్ లో ఉంటున్నానని గేట్స్ ట్వీట్ చేశారు.తాను వైద్య నిపుణుల సలహాలను అనుసరిస్తున్నానని అతను ట్వీట్ లో పేర్కొన్నారు. తాను కొవిడ్ టీకాలు వేయించుకొని గొప్ప వైద్య సంరక్షణ చర్యలు తీసుకోవడం తన అదృష్టమని గేట్స్ మరో ట్వీట్ లో చెప్పారు. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు బిల్ గేట్స్ పలు పేద దేశాలకు కరోనా వ్యాక్సిన్లు, మందులను తన గేట్స్ ఫౌండేషన్ నుంచి అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు. బిల్ గేట్స్ పేద దేశాలకు యాంటీవైరల్ కొవిడ్-19 పిల్స్ లను సరఫరా చేసేందుకు తన ఫౌండేషన్ తరపున 120 మిలియన్ల డాలర్లను ఖర్చు చేశారు. 


Read more