Jun 4 2021 @ 19:17PM

హీరోయిన్లకు బికినీలు కామనే: రైజా విల్సన్‌

బిగ్‌బాస్‌ రియాల్టీ షో ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి.. కోలీవుడ్‌‌లో సినీ అవకాశాలు దక్కించుకున్న నటి రైజా విల్సన్‌. ప్రస్తుతం ఆమె నటించిన పలు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో ఆమె అప్పుడప్పుడూ తన అందాలను ఎక్స్‌పోజ్‌ చేస్తూ తీసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. తాజాగా ఆమె పోస్టు చేసిన ఓ సెక్సీ ఫొటో ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. దీనిపై నెటిజన్లు పలు రకాలైన కామెంట్స్‌ చేశారు. వీటికి రైజా విల్సన్‌ తనదైనశైలిలో సమాధానమిచ్చింది. 


‘నటి లేదా హీరోయిన్లు బికినీలు ధరించడం సర్వసాధారణం. నెటిజన్లు ఈ బికినీ ధరించిన ఫొటో చూడటం కంటే, దృష్టిసారించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. నాకు నచ్చిన దుస్తులు ధరిస్తాను. ఈ విషయంలో ఇతరులు ఏమంటారన్నది నాకు అవసరంలేదు’ అని తేల్చి చెప్పింది. కాగా, రైజా విల్సన్‌ ముఖారవిందం కోసం స్కిన్‌ ట్రీట్మెంట్‌ తీసుకోగా, అదికాస్తా వికటించి అందవిహీనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనమైంది. తనకు చర్మ చికిత్స చేసిన వైద్యురాలిపై రైజా విల్సన్‌ కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేయగా, ఆ వైద్యురాలు కూడా రైజా విల్సన్‌పై రూ.5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.

Otherwoodsమరిన్ని...