మోటారు సైకిళ్ల దొంగ అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-07-25T05:27:03+05:30 IST

పలు ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న పాత నేరస్తుడు షేక్‌ మహబూబ్‌ సుభానీని సీసీఎస్‌, చిన్నబజారు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.5లక్షల విలువ చేసే 10 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

మోటారు సైకిళ్ల దొంగ అరెస్ట్‌
నిందితుడి వివరాలు తెలుపుతున్న డీఎస్పీ శివాజీరాజా

10 వాహనాల స్వాధీనం

నెల్లూరు(క్రైం), జూలై 24: పలు ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీకి పాల్పడుతున్న పాత నేరస్తుడు షేక్‌ మహబూబ్‌ సుభానీని సీసీఎస్‌, చిన్నబజారు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.5లక్షల విలువ చేసే 10 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం విలేకర్ల సమావేశంలో నిందితుని వివరాలను సీసీఎస్‌ డీఎస్పీ ఏ శివాజీరాజా వెల్లడించారు. జిల్లాలో వరుసగా మోటారు సైకిళ్ల చోరీలు జరుగుతుండ టంతో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ జీ రామారావు, చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు  పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పాత నేరస్తులపై నిఘా ఉంచామన్నారు. శనివారం ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు షేక్‌ మహబూబ్‌ సుభానీ అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నబజారు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక మోటర్‌ సైకిల్‌, కొడవలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒకటి, ప్రకాశం జిల్లా పరిధిలో 8 మోటర్‌ సైకిళ్లు చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. 

Updated Date - 2021-07-25T05:27:03+05:30 IST