107 బైక్‌లు స్వాధీనం

ABN , First Publish Date - 2022-06-28T06:22:44+05:30 IST

జిల్లాలో వాహనాలు చోరీకి పాల్పడే ఇద్దరి ముఠాలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి భారీగా బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలి పారు.

107 బైక్‌లు స్వాధీనం

జగ్గంపేట, జూన్‌ 27: జిల్లాలో వాహనాలు చోరీకి పాల్పడే ఇద్దరి ముఠాలో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి భారీగా బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలి పారు. జగ్గంపేట సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో వాహనాలు చోరీ జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 107 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఏలేశ్వరం గ్రామానికి చెందిన నడిగట్ల కృష్ణ, గోవిందపురం గ్రామానికి చెందిన మంగిన వీరవెంకట సత్యనారాయణ వాహనాలు చోరీలకు పాల్పడుతున్నారన్నారు. వారు ఏడు జిల్లాల పరిధిలో ఇప్పటివరకు చోరీలు చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. పార్కింగ్‌ చేసిన వాహనాలను చాకచక్యంగా దొంగలించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. దొంగలించిన వాహనాలను రూ.5వేలు, రూ.10వేలకు విక్రయించడం, వాహనాలకు సంబంధించిన రికార్డు ఇచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు ఇవ్వాలని వారిని నమ్మ పలికేవారన్నారు. ఈ విధంగా రూ.50వేలు, రూ.60వేల విలువైన వాహనాలను రూ.10వేలకు విక్రయించి సొమ్ము చేసుకునే వారని వివరించారు. ఇలా ఎక్కడా అనుమానం రాకుండా వాహనాలను కొంతకాలంగా విక్రయిస్తూ భారీస్థాయిలో చోరీలకు పాల్పడ్డారన్నారు. కాకినాడ జిల్లాలో 17, తూర్పుగోదావరి జిల్లా 32, విజయనగరం జిల్లా 2, విశాఖపట్నం 2, కోనసీమ జిల్లా 12, అల్లూరి సీతారామరాజు జిల్లా 1, పశ్చిమగోదావరి జిల్లా 41 ద్విచక్ర వాహనాలను దొంగలించారన్నారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాహనాలకు సంబంధించి 32కేసులు నమోదయ్యాయని, ఇతర జిల్లాలకు సమాచారం అందించి సంబంధిత యాజమానులకు వాహనాలు అప్పగించామని ఎస్పీ తెలిపారు. వాహనాలు స్వాధీనం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ బి.సూర్యఅప్పారావు, ఎస్‌ఐ రఘునాథరావు, ఏఎస్‌ఐలు నూకరాజు, సుబ్బారావులు, కానిస్టేబుల్‌ బంగార్రాజు, ప్రసాద్‌, సతీష్‌రెడ్డి, హోంగార్డు నాగేశ్వరరావు, సోమరాజులను అభినందిస్తూ నగదు బహుమతిని ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ పి.శ్రీనివాస్‌, డీఎస్పీ బి.అప్పారావు, ఎస్బీ డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలపై నిఘా
జిల్లాలో నేర చరిత్రను అరికట్టేందుకు అసాంఘిక శక్తులపై ప్రత్యేకంగా నిఘా ఉంచామన్నారు. రహదారి మీదుగా దాబా, హోటల్‌ వద్ద మద్యం విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాలు నివారించేందుకు ప్రధాన కూడళ్లలో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, పోలీస్‌ పర్యవేక్షణ ఉం టుందన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, చోరీలు, నేరాలను నిరోధించేందుకు అవసరమైన చోట సీసీ కెమెరాలు పటిష్టం చేస్తామన్నారు. ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్‌ వ్యాపారస్థులు వారి షాపు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా అవగాహన కల్పిస్తామన్నారు. పోలీసులకు క్వార్టర్స్‌ నిర్మాణం కోసం కృషి చేస్తామని, జిల్లా అంతటా స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీస్‌లతో నిరంతరం నిఘా ఉంచుతామన్నారు.

Updated Date - 2022-06-28T06:22:44+05:30 IST