Viral Video: బస్సు టైర్ కిందే తల.. అయినా బతికి బట్టకట్టిన 19ఏళ్ల కుర్రాడు.. భూమి మీద నూకలుంటే గానీ ఇలాంటి అద్భుతాలు జరగవేమో!

ABN , First Publish Date - 2022-07-22T18:07:35+05:30 IST

బెంగళూరు పోలీసు అధికారి పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. యాక్సిండెంట్‌కు సంబంధించిన ఆ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. పెద్ద ప్రమాదం నుంచి 19ఏళ్ల యువకుడు క్షేమంగా బయటపడంపట్ల సం

Viral Video: బస్సు టైర్ కిందే తల.. అయినా బతికి బట్టకట్టిన 19ఏళ్ల కుర్రాడు.. భూమి మీద నూకలుంటే గానీ ఇలాంటి అద్భుతాలు జరగవేమో!

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు పోలీసు అధికారి పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. యాక్సిండెంట్‌కు సంబంధించిన ఆ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. పెద్ద ప్రమాదం నుంచి 19ఏళ్ల యువకుడు క్షేమంగా బయటపడంపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ‘ఆ కుర్రాడికి భూమి మీద నూకలు మిగిలుంటే కానీ చావు అంచుల వరకూ వెళ్లినా ప్రాణాలతో బయటపడ్డాడు’  అని కామెంట్ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..





ఇంట్లో బ్రెడ్ అయిపోవడంతో.. దాన్ని తీసుకురావడానికి అలెక్స్ సిల్వా అనే 19ఏళ్ల యువకుడు బైక్‌పై స్థానికంగా ఉన్న బేకరికీ బయల్దేరాడు. అతడు బైక్‌పై కొంచెం దూరం వెళ్లగానే.. టర్నింగ్ వద్ద అకస్మాత్తుగా ఓ బస్సు ఎదురైంది. దీంతో దాన్ని అతడు తప్పించబోయి.. అదుపు తప్పాడు. దీంతో నేరుగా వెళ్లి అతడు బస్సు వెనక చక్రాల వద్ద పడ్డాడు. బస్సు టైర్ల కిందే తల ఉన్నప్పటికీ.. అతడు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు తలకు నాణ్యమైన హెల్మెట్ ఉండటం.. బస్సు డ్రైవర్ కూడా వెంటనే స్పందించి బ్రేక్ వేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. టైర్లు, రోడ్డు మధ్య హెల్మెట్ దెబ్బతిన్నా.. అతడి తలకు పెద్దగా గాయాలు కాలేదు. ఈ ఘటన బ్రెజిల్‌లో సోమవారం జరగగా.. అందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అవడం.. అదికాస్తా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో బెంగళూరు ట్రాఫిక్ పోలీసు అధికారి దృష్టికి రావడంతో.. హెల్మెట్ ప్రాముఖ్యతను తెలుపుతూ ఆ వీడియోను ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. 


Updated Date - 2022-07-22T18:07:35+05:30 IST