Viral Video: ఈ యువకుడికి అదృష్టం టన్నుల కొద్దీ ఉన్నట్టుంది.. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు..

ABN , First Publish Date - 2022-01-31T02:17:48+05:30 IST

ఓ యువకుడికి ఆవగింజంత కాదు.. ఏకంగా టన్నుల కొద్దీ అదృష్టం ఉన్నట్టుంది. బైక్‌లో దూసుకుపోతూ పొరపాటున స్లిప్ అయి కిందపడ్డా.. క్షణాల్లో తేరుకుని లారీ బారి నుంచి తప్పించుకున్నాడు...

Viral Video: ఈ యువకుడికి అదృష్టం టన్నుల కొద్దీ ఉన్నట్టుంది.. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు..

గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు పెద్దలు. ఓ యువకుడికి ఆవగింజంత కాదు.. ఏకంగా టన్నుల కొద్దీ అదృష్టం ఉన్నట్టుంది. బైక్‌లో దూసుకుపోతూ పొరపాటున స్లిప్ అయి కిందపడ్డా.. క్షణాల్లో తేరుకుని లారీ బారి నుంచి తప్పించుకున్నాడు. రెప్పపాటు ఆలస్యం అయినా ప్రాణాలు పోయేవి. ఈనెల 24న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..


మలేషియాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం య్యూటూబ్‌లో వైరల్ అవుతోంది. ఓ రహదారిపై వాహనాలు రద్దీగా తిరుగుతున్నాయి. మరోవైపు వర్షం పడుతూ ఉంది. అదే సమయంలో ఓ యువకుడు బైకులో వస్తూ పొరపాటున జారి కిందపడతాడు. రోడ్డు మధ్యలో పడిపోగానే వెంటనే పైకి లేచేందుకు ప్రయత్నిస్తాడు. ఆ వెంటనే వెనుక ఓ లారీ వేగంగా వస్తూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకునేందుకు ఇంకా వేగంగా రోడ్డు దాటేస్తాడు. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోతుంది. ఒక్క క్షణం ఆలస్యమైనా ప్రాణాలకే ముప్పు వాటిళ్లేది. అందులోనూ యువకుడు హెల్మెట్ ధరించడంతో ఎలాంటి గాయాలూ కాలేదు. దీన్నంతా కారులోని ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బైకర్‌కు, లారీ డ్రైవర్‌కు సలహాలు ఇస్తున్నారు. వర్షాకాలంలో వాహనాలు నడిపేటప్పుడు.. జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

ఏనుగు పాలు తాగుతూ, ఆటలాడుతున్న చిన్నారి.. జాగ్రత్త పాపా అంటూ సలహాలిస్తున్న నెటిజన్లు..



Updated Date - 2022-01-31T02:17:48+05:30 IST