Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెడు వ్యసనాలకు బానిసలై చోరీలు

  • ముగ్గురి అరెస్టు..  12 మోటారుసైకిళ్ల స్వాధీనం 

కడియం, అక్టోబరు 23: చెడు వ్యసనాలకు బానిసలై అవసరాల నిమిత్తం మోటార్‌సైకిళ్ల చోరీ లకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం కడియం పోలీస్‌స్టేషన్‌లో సౌత్‌జోన్‌ డీఎస్పీ ఎం.శ్రీలత తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం ఆవ రోడ్డు ప్రాంతానికి చెందిన బర్ల చంద్రశేఖర్‌, ధవళేశ్వరం ఎర్రకొండకు చెందిన అడపా శ్యామ్‌కుమార్‌, రాజమహేంద్రవరం మేదరపేటకు చెందిన పెంకే చందుతో కలిసి మోటారుసైకిళ్లను దొంగతనం చేసేవారు. కడియం స్టేషన్‌ పరిధిలో 8, బొమ్మూరు పరిధిలో 2, ధవళేశ్వరం, రాజానగరం పరిధిల్లో ఒక్కొక్కటి చొప్పున 12మోటారుసైకిళ్లను దొంగిలించారు. వాటిని చందు తక్కువ ధరకు అమ్మేవాడు. కిర్లంపూడికి చెందిన నడిశెట్టి దుర్గాప్రసాద్‌కు అమ్ముతుండగా పోలీసులు గుర్తించారు. కడియం ఇన్స్‌పెక్టర్‌ డి.రాంబాబు, ఎస్‌ఐ కె.నాగరాజు, సిబ్బంది వేమగిరి పాయిజాన్‌ దాబావద్ద నిందితులను అరెస్టు చేసి 12 మోటారుసైకిళ్లు రికవరీ చేసినట్టు డీఎస్పీ తెలిపారు.

Advertisement
Advertisement