Abn logo
Sep 23 2021 @ 00:31AM

బైక్‌ల దొంగ దొరికాడు

  17  బైక్‌లు స్వాధీనం
కడియం, సెప్టెంబరు 22: మోటారుసైకిళ్ల దొంగతనానికి పాల్పడుతున్న కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామానికి చెందిన పాతనేరస్థుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి 17 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండల డీఎస్పీ ఎం.శ్రీలత తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామానికి చెందిన కోరాడ వెంకటేశ్వర్లు అలియాస్‌ శేఖర్‌ మోటారుసైకిళ్లు దొంగతనానికి పాల్పడుతున్నాడు. అతడిపై గతంలో నేరచరిత్ర ఉంది. కడియం పరిధిలో 2, రావులపాలెం పరిధిలో 3, పెదపూడి పరిధిలో 3, సర్పవరం పరిధిలో 2, రామచంద్రపురం పరిధిలో 2, అనపర్తి, మండపేట ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున, తెలియని ప్రాంతం నుంచి 3 మొత్తం 17 మోటారుసైకిళ్లను అపహరించాడు. ఈ నేపథ్యంలో కోరాడ వెంకటేశ్వర్లు అలియాస్‌ శేఖర్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మోటారుసైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.    సమావేశంలో సీఐ కె.శ్రీధర్‌కుమార్‌, ఎస్‌ఐ నాగరాజు, సీసీఎస్‌ రెండో పట్టణ  ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు.