వీహెచ్‌పీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

ABN , First Publish Date - 2021-01-19T05:18:03+05:30 IST

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కోసం సోమవారం గోదావరిఖని కోదండ రామాలయం నుంచి పట్టణ వీధుల్లో బైక్‌ ర్యాలీని నిర్వహించారు.

వీహెచ్‌పీ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ
ఆలయంలో పూజలు చేస్తున్న వివేక్‌, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు

కళ్యాణ్‌నగర్‌, జనవరి 18: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిధుల సేకరణ కోసం సోమవారం గోదావరిఖని కోదండ రామాలయం నుంచి పట్టణ వీధుల్లో బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు వివేక్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 500 ఏళ్లుగా అయోధ్యలో రాంమందిర నిర్మాణం కోసం దేశప్రజల ఆకాంక్ష అని, రామమందిర నిర్మాణం కోసం ప్రజలను భాగస్వామ్యులను చేసి ఇంటింటికి వెళ్లి రా మమందిర నిర్మాణం కోసం నిధులను సేకరించనున్నట్టు  తెలిపారు. అయోధ్యలో క ట్టబోయే రామమందిరం నిర్మాణ శైలిపై ప్రజలకు వివరించనున్నట్టు వివేక్‌ పేర్కొన్నారు. దీని కోసం కుల మతాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో భా గస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన రామమందిర నిర్మాణ కరపత్రాలను, డోర్‌ స్టిక్లర్లను ఆవిష్కరించారు. కోదండ రామాలయం నుంచి ప్రారంభమైన బైక్‌ ర్యాలీ రమేష్‌నగర్‌, కళ్యాణ్‌నగర్‌, చౌరస్తా వరకు కొనసాగిం ది. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యదర్శి రాజన్న, వీ హెచ్‌పీ నాయకులు మాదవరపు వెంకట్రావ్‌, వేపూరి రాములు, కాస సత్యనారాయణ, అయోధ్య రవీందర్‌, మోడెం సురేందర్‌, అడిగొప్పుల రాజు, ముష్కె సంపత్‌, రాంచంద్రారెడ్డి, బల్మూరి అమరేందర్‌, కౌశిక హరి, బల్మూరి వనిత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-19T05:18:03+05:30 IST