Advertisement
Advertisement
Abn logo
Advertisement

పదోన్నతులు కల్పించాలని బైక్‌ ర్యాలీ

డిచ్‌పల్లి, డిసెంబరు 4: 2014లో అధ్యాపకులుగా చేరిన వారందరికీ పదో న్నతులు కల్పించాలని శనివారం ఆర్ట్స్‌ కళాశాల నుంచి పరిపాలన భవనం వరకు అధ్యాపకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బాలకిషన్‌ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా పదోన్నతుల కోసం వర్సిటీ అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. డాక్టర్‌ ల క్ష్మణ చక్రవర్తి, డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ మహేందర్‌, డాక్టర్‌ జమీల్‌, రమణ చారి, కిరాణ్మయి, జావేరియ ఉజ్మ, సంపత్‌, నీలిమ పాల్గొన్నారు. 

తెలుగులో శమంతకు డాక్టరేట్‌ 

టీయూ తెలుగు అధ్యాయన శాఖ పరిశోధక విద్యార్థిని శమంతకు శనివా రం పీహెచ్‌డీ డాక్టరేట్‌ పట్టాను ప్రదానం చేశారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బాలశ్రీనివాస మూర్తి పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థిని తెలంగాణ సాహి త్యం శ్రామిక జీవన చిత్రన 2000-10 అనే అంశంపై పరిశోధన చేసి సి ద్ధాంత గ్రంథం రూపొందించారు. టీయూ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో వై వా నిర్వహించగా, ఓయూ తెలుగు విభాగం నుంచి ప్రొఫెసర్‌ నిత్యనంద రావు హాజరై ప రిశోధకురాలిని పలు ప్రశ్నలు అడిగి సమా ధానాలు తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశా రు. శమంత పీహెచ్‌డీ సాధించడం పట్ల వీసీ రవీందర్‌ గుప్తా, రిజిస్ట్రార్‌ యాదగిరి, ప్రిన్సిపాల్‌ నాగరాజు, సీవోఈ అరుణ, అభినందనలు తెలిపారు.

6న ఇంటర్‌ కాలేజ్‌ మెన్‌, ఉమెన్‌ వాలీబాల్‌ సెలక్షన్స్‌ 

తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంటర్‌ కాలేజ్‌ వాలీబాల్‌ మెన్‌ అండ్‌ ఉమె న్‌ సెలక్షన్‌ డిసెంబరు 6న ఉదయం 10 గంటలకు వర్సిటీ మైదానంలో ని ర్వహించబడతాయని స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి ఖవి తెలిపారు. సెలక్షన్స్‌కు వర్సిటీ ప రిధిలోని యూజీ, పీజీ ప్రొఫెషన్‌ కళాశాలలో జరిగే విద్యార్థులు ఆగస్టు 21 నాటికి 26 సంవత్సరాల లోపు ఉండాలని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పదోతరగతి, ఇంటర్‌, సెమిస్టర్‌ మెమో జిరాక్స్‌ కాపీలు, కళాశాల ఐడీ కార్డులు, టీయూ ఇంటర్‌ కాలేజ్‌ ఎల్జీ బులిటి ఫాం తదితర వివరాలతో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. 

ఏకపక్ష నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి 

తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు శనివారం వర్సిటీ పరిపాలన భవనం ముట్టడించి ఆం దోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రెగ్యూలర్‌ కో ర్సులను సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సులుగా చిత్రీకరించడం కుట్ర చేయడమే అన్నారు. సెల్ఫ్‌ ఫైౖనాన్స్‌ కోర్సుల పద్ధతి వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇ లా చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకు తీరని అన్యాయం జరుగుతుంద న్నారు. వర్సిటీలో 11 కోర్సులను సెల్ఫ్‌ ఫైౖనాన్స్‌ కోర్సులుగా మార్చాడని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు విఠల్‌, నవీన్‌, సంతోశ్‌, శ్రీశైలం, రాకేశ్‌, విద్యార్థులు పాల్గొన్నారు. 

టీ యూలో నేషనల్‌ వర్క్‌ షాప్‌ 

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్‌ మెనేజ్‌మెంట్‌ డిపార్టుమెంట్‌ ఆ ధ్వర్యంలో శనివారం ఆన్‌లైన్‌ వర్క్‌ షాప్‌ శనివారం జరిగింది. ప్రమ్‌ డాట టు ఇన్‌సైడ్స్‌ ఇంపర్టెన్స్‌ ఆఫ్‌ ఎక్స్‌ల్‌ అనే అంశంపై జరిగిన ఆన్‌లైన్‌ వర్క్‌ షాప్‌లో చీఫ్‌ ఫ్యాట్రన్‌గా వీసీ రవీందర్‌, ప్యాట్రన్‌గా రిజిస్ట్రార్‌ యాదగిరి పా ల్గొన్నారు. దీరాజ్‌ కొండి మాట్లాడుతూ... ప్రతీ విద్యార్థి వర్క్‌ షాపులను స ద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వృత్తి పరమైన రోజు వారి పనుల కో సం స్పైడ్‌ షీట్లను చేయాలని అన్నారు. ఈ వర్క్‌ షాపులో కన్వీనర్‌గా అ సోసియేట్‌ ప్రొఫెసర్‌ అపర్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement