Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 28 Sep 2021 10:15:15 IST

బైక్ రేస్‌లో కిందపడి చనిపోయాడనుకున్నారు.. కానీ బంధువులకు అనుమానం వచ్చి ఆరా తీస్తే.. అసలు విషయం వెలుగులోకి..!

twitter-iconwatsapp-iconfb-icon
బైక్ రేస్‌లో కిందపడి చనిపోయాడనుకున్నారు.. కానీ బంధువులకు అనుమానం వచ్చి ఆరా తీస్తే.. అసలు విషయం వెలుగులోకి..!

బెంగళూరు: బైక్ రేసులో పాల్గొని ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో మరణించాడనుకున్నారు. కానీ బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..


బెంగళూరుకు చెందిన అస్బక్ మోన్ అనే వ్యక్తికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ పోటీలు నిర్వహించిన తప్పక పాల్గొనేవాడు. 2018లో రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో బైక్ రేసింగ్ పోటీలు ఉన్నాయంటే వెళ్లాడు. కానీ ప్రమాదవశాత్తు అతను కిందపడిపోయి మరణించారు. పోలీసులు అస్బక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా భార్య, తండ్రి బెంగళూరు నుంచి జైసల్మీర్‌కు వచ్చారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కారాలు చేశారు.


కానీ అస్బక్ బంధువులకు అతడిమీద చాలా నమ్మకం ఉండేది. ఎలాంటి పోటీలోనైనా కిందపడిపోకుండా నడపగలిగే సత్తా అస్బక్‌కు ఉందని వారి నమ్మకం. దీంతో ప్రమాదం మీద తమకు అనుమానం ఉందని, ఇందులో ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతం జైసల్మీర్ కాబట్టి.. బెంగళూరు పోలీసులు ఆ ప్రాంత పోలీసుల సహాయం కోరారు. కేసును సీరియస్‌గా పరిగణించి దర్యాప్తు చేయగా పోలీసులకు కూడా ఇది హత్యేనని అనుమానం కలిగింది. చివరికి ఇది కుట్రేనని, ఇందులో అస్బక్ స్నేహితుల అస్తం ఉందని తేలింది. అప్పటికే విషయం అర్థమయ్యి అస్బక్ స్నేహితులు పారిపోయారు. పోలీసులు బెంగళూరు, కేరళలో తనిఖీలు నిర్వహించి సంజయ్‌కుమార్, విశ్వాస్ అనే వ్యక్తులను సోమవారం అరెస్టు చేశారు. అస్బక్‌ను చంపడం వెనుక కారణాలేంటో త్వరలోనే కనుక్కుంటామని పోలీసులు వెల్లడించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.