డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-08-04T05:35:19+05:30 IST

జాతీయ రహదారిపై డివైడర్‌ను మోటారు సైకిల్‌ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఏలేశ్వరం పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు గండ్రెడ్డి మాధవరావు(45), శిడగం వెంకటరమణ (55) మంగళవారం ఉదయం మోటారు సైకిల్‌పై తలుపులమ్మలోవ వెళ్లి సాయంత్రం తిరిగి ప్రయాణమయ్యారు.

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ ఇద్దరి మృతి

 గొల్లప్రోలు రూరల్‌, ఆగస్టు 3: జాతీయ రహదారిపై డివైడర్‌ను మోటారు సైకిల్‌ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఏలేశ్వరం పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు గండ్రెడ్డి మాధవరావు(45), శిడగం వెంకటరమణ (55) మంగళవారం ఉదయం మోటారు సైకిల్‌పై తలుపులమ్మలోవ వెళ్లి సాయంత్రం తిరిగి ప్రయాణమయ్యారు. 16వ జాతీయ రహదారిపై వన్నెపూడి జంక్షన్‌ సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాసరావు, గొల్లప్రోలు ఎస్‌ఐ రామలింగేశ్వరరావు పరిశీలించారు. ప్రమాద తీవ్రతకు ట్రాఫిక్‌ బోర్డు ఎగిరి కింద పడిపోయింది.
మృత్యుఒడికీ కలిసే..
   దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న గండ్రెడ్డి మాధవబాబ, శిడగం వెంకటరమణ   రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఏలేశ్వరంలో విషాదం నెలకొంది. పట్టణంలోని 7వవార్డు నందివీఽధి పైడితల్లి అమ్మవారి గుడి ప్రాంతంలో నివాసముంటున్న మాధవబాబు ఏలేశ్వరం గ్రామ పంచాయతీ వార్డుసభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పట్టణ వైసీపీ నాయకుడిగా సేవలందిస్తున్నారు. ఆయనకు భార్య పద్మజ, హైందవి, హర్షిత, శ్రీలలిత అనే ముగ్గురు కుమార్తెలున్నారు. మాధవబాబుకు అనుచరుడిగా ఉండే పెద్దవీధికి చెందిన శిడగం శివ ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో నిర్వహించే వారపు సంతల్లో నిత్యావసర సరుకులు విక్రయించే పనికి వెళ్తుంటారు. ఈయనకు భార్య వెంకటలక్ష్మి, సత్యచాందిని, నితిన్‌ అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తరచూ ఇద్దరు కలిసే వెళ్తుంటారు. మంగళవారం ఉదయం సైతం వారు ఇద్దరు కలసి మోటారుబైక్‌పై తలుపులమ్మలోవలో అమ్మవారి దర్శనానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. తిరిగి ఏలేశ్వరానికి వస్తున్న నేపథ్యంలో వారు ప్రమాదవశాత్తూ డివైడర్‌ను ఢీకొట్టి చనిపోయారు.  అందరితో కలసి మెలసి స్నేహంగా ఉండే మాధవబాబు, శివ రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారన్న విషయాన్ని జీర్ణించుకోలేక కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అలమండ సత్యవతి, వైసీపీ జిల్లా కార్యదర్శి అలమండ చలమయ్య, పైల విజయ్‌, సామంతుల చిన్నారావు, మూది నారాయణస్వామి, కడింశెట్టి వాసు,పైల అబ్బు తదితర నాయకులు విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-08-04T05:35:19+05:30 IST