బీహార్‌లో నేటి నుంచి అన్‌లాక్-5... తెరుచుకున్న స్కూళ్లు, వ్యాపార సముదాయాలు!

ABN , First Publish Date - 2021-08-07T15:43:22+05:30 IST

కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో...

బీహార్‌లో నేటి నుంచి అన్‌లాక్-5... తెరుచుకున్న స్కూళ్లు, వ్యాపార సముదాయాలు!

పట్నా: కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో బీహార్‌లో ఈరోజు (ఆగస్టు 7) నుంచి అన్‌లాక్-5 ప్రక్రియ మొదలయ్యింది. దీంతో విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, వ్యాపార సముదాయాలు తెరుచుకోనున్నాయి. అయితే ప్రస్తుతానికి తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు స్కూళ్లు తెరిచారు. త్వరలోనే మిగిలిన తరగతుల విద్యార్థులకు కూడా క్లాసులు నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కూడా పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటి వరకూ సరి, బేసి విధానంలో నడుస్తున్న దుకాణాలు ఇకపై ప్రతీరోజూ తెరుచుకోనున్నాయి. అయితే పాఠశాలల నిర్వాహకులు, వ్యాపార సముదాయాల నిర్వాహకులు కరోనా ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాల్సివుంది. అలాగే ప్రజలు కూడా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి.

Updated Date - 2021-08-07T15:43:22+05:30 IST