బాబోయ్ కరోనా టెస్టా...? రైల్వే స్టేషన్‌లో పరుగులే పరుగులు

ABN , First Publish Date - 2021-04-17T18:03:06+05:30 IST

మీరు చూస్తోంది రైల్వే స్టేషన్. తమ తమ వస్తువులతో ప్రజలు గుంపులు గుంపులుగా పరుగులు పెడుతున్నారు కదా

బాబోయ్ కరోనా టెస్టా...? రైల్వే స్టేషన్‌లో పరుగులే పరుగులు

పాట్నా : మీరు చూస్తోంది రైల్వే స్టేషన్. తమ తమ వస్తువులతో ప్రజలు గుంపులు గుంపులుగా పరుగులు పెడుతున్నారు కదా... ఇక్కడేమీ కాలేదు. ఏ పోలీసులూ వారిని పరుగులు పెట్టించడం లేదు. లేదంటే ట్రైన్ కోసం కూడా కాదు. బాంబు అంతకంటే లేదు. అక్కడి అధికారులు ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామంటే భయపడి ఇలా పరుగులు తీస్తున్నారు. కరోనా, కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు పనిచేసే ప్రాంతం నుంచి స్వస్థలాలకు తిరుగు పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లన్నీ రద్దీతో నిండిపోతున్నాయి. రద్దీ పెరగడం, సొంతూళ్లకు తిరిగి పయనమవుతున్న నేపథ్యంలో వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని సీఎం నితీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. అయితే కరోనా పరీక్షలు నిర్వహించడానికి వైద్య సిబ్బంది ఉద్యుక్తమవుతున్న సందర్భంలో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ‘‘టెస్టుల నిమిత్తమై వారిని ఆపడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తున్నారు. గొడవకు దిగుతున్నారు. ఇలాంటి సమయాల్లో పోలీసు సిబ్బంది కూడా అందుబాటులో లేరు. ఒక పోలీస్ అధికారి మాత్రం వచ్చి మేమేమీ చేయలేం ఇక అంటూ వెళ్లిపోయారు’’ అని వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ అని వస్తే ఎక్కడ అధికారులు బిహార్‌లోనే ఉంచేస్తారని అనుకున్నారో, తమ తోటి వాళ్లు సొంతూళ్లకు వెళ్లిపోతే, ఇక్కడే ఒక్కరే ఉంటామని భయపడ్డారో తెలియదు కానీ, కోవిడ్ టెస్టులంటే ఇలా పరుగులు పెట్టారు.  



Updated Date - 2021-04-17T18:03:06+05:30 IST