Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 13 2021 @ 11:37AM

Bihar: షెల్టర్ హోమ్‌లో బాలికపై అత్యాచారం

గయ (బీహార్): బీహార్ రాష్ట్రంలోని మరో షెల్టర్ హోం బాగోతం బయటపడింది. బుద్ధగయ నగరంలోని షెల్టర్ హోంలోని సిబ్బంది తనపై అత్యాచారం చేశారని ఓ బాలిక ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. నవడ ప్రాంతానికి చెందిన బాలిక బుద్ధ గయలోని షెల్టరు హోంలో నివాసం ఉండేది. షెల్టరు హోంలో ఉన్న తనపై సిబ్బందే అత్యాచారం చేశారని బాలిక ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుకు స్పందించిన బుద్ధగయ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. ఈ దారుణ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి 48 గంటల్లో నివేదిక సమర్పించాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించారు. గతంలో బీహార్ రాష్ట్రంలో షెల్టరు హోంలో పలువురు బాలికలపై అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

Advertisement
Advertisement