థర్మాకోల్‌తో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై బ్యాన్... పట్టుబడితే ఐదేళ్ల జైలు!

ABN , First Publish Date - 2021-08-10T12:33:48+05:30 IST

బీహార్‌లో ఈ ఏడాది డిసెంబరు 14 అర్ధరాత్రి నుంచి...

థర్మాకోల్‌తో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై బ్యాన్... పట్టుబడితే ఐదేళ్ల జైలు!

పట్నా: బీహార్‌లో ఈ ఏడాది డిసెంబరు 14 అర్ధరాత్రి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చేస్తే అది నేరంగా మారనుంది. పర్యావరణ విభాగం ఈ విషయాన్ని తెలియజేసింది. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై పూర్తి స్థాయిలో బ్యాన్ విధించినట్లు తెలిపింది. దీనిని ఉల్లంఘిస్తే భారతీయ శిక్షా స్మృతి కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 


సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌తో చేసే కప్పులు, ప్లేట్లు, చమ్చాలు, అలాగే థర్మాకోల్‌తో చేసే కప్పులు, ఇతర పాత్రలు మొదలైనవి విక్రయించడంపై నిషేధం విధించారు. ఇదేవిధంగా ప్లాస్టిక్‌ బ్యానర్లు, జెండాలు, నీటి పౌచ్‌లు మొదలైనవి కూడా విక్రయించకూడదు. ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే వారు ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, వారికి లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తారని పర్యావరణ విభాగం అధికారులు తెలిపారు.

Updated Date - 2021-08-10T12:33:48+05:30 IST