సాయుధ పహరా మధ్య బీహార్ పోలింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-28T13:02:28+05:30 IST

సాయుధ పహరా మధ్య బీహార్ రాష్ట్రంలో మొదటివిడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది....

సాయుధ పహరా మధ్య బీహార్ పోలింగ్ ప్రారంభం

రెండు మందుపాతరలు స్వాధీనం

పట్నా (బీహార్): సాయుధ పహరా మధ్య బీహార్ రాష్ట్రంలో మొదటివిడత పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. కొవిడ-19 మార్గదర్శకాల ప్రకారం ఓటర్లు సామాజిక దూరం పాటించడంతోపాటు మాస్కులు  ధరించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొదటివిడత 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. లఖిసరాయ్ పట్టణంలోని 168వ పోలింగ్ బూత్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో పోలింగుప్రకియకు అంతరాయం వాటిల్లింది. ఔరంగాబాద్ జిల్లా ధిబ్రా ప్రాంతంలో నక్సలైట్లు అమర్చిన రెండు మందుపాతరలను సీఆర్ పీఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకొని వాటిని విధ్వంసం చేశారు. 

Updated Date - 2020-10-28T13:02:28+05:30 IST