రైతుల అభివృద్ధికి పెద్దపీట

ABN , First Publish Date - 2020-05-19T10:23:47+05:30 IST

రైతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ముఖ్యంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

రైతుల అభివృద్ధికి పెద్దపీట

వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌


మంచిర్యాల కలెక్టరేట్‌, మే 18: రైతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ముఖ్యంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సోమవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా కలెక్టర్‌ భారతి హోళికేరితోపాటు ఆయా శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడు తూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అతి ప్రధానమైనదని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు ప్రవేశపెట్టా మన్నారు.


రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలలో తెలంగాణ సోన పండించేలా రైతు లకు అవగాహన కల్పంచాలని, ఈ రకంపై మార్కెట్‌లో డిమాండ్‌ ఉందన్నా రు. పెసర్లు, జనుము, జీలుగు పంటలు సాగు చేసి కొంత మేర  అదే భూమి లో ఎరువుగా వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కలెక్టర్‌ భారతి హొళికేరి మాట్లాడుతూ జిల్లాలో గోదాముల క్లస్టర్లు 55 ఉన్నా యని, ప్రభుత్వ అనుమతి లభించే వరకు వరి విత్తనాలు అమ్మకాలు జరగ కుండా చర్యలు తీసుకుంటామన్నారు.


జిల్లాలో గతంలో 38 వేల ఎకరాలలో జీలుగు, జనుము పంట సాగు జరిగేదని, ఈసారి 43 వేల ఎకరాలలో సాగు కు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అదనపు కలెక్టర్‌ వై. సురేందర్‌రావు, సీపీవో సత్యనారాయణరెడ్డి,  డీఏవో వీరయ్య, డీసీవో సంజీవ రెడ్డి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి గజానంద్‌, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు గురువయ్య అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-19T10:23:47+05:30 IST