May 16 2021 @ 09:36AM

‘ఆదిపురుష్‌’లో బిగ్‌బాస్ విన్న‌ర్‌..!

ప్ర‌భాస్ ‘ఆదిపురుష్‌’లో బిగ్‌బాస్ విన్న‌ర్ న‌టించ‌బోతున్నారంటూ వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఇంత‌కీ ఏ బిగ్ బాస్ విన్న‌ర్ న‌టించ‌నున్నార‌నే వివ‌రాల్లోకెళ్తే...‘ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో ముందుగా ‘రాధేశ్యామ్‘ విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. కాగా..మ‌రో రెండు పాన్ ఇండియా సినిమాలు  ‘స‌లార్‌, ఆదిపురుష్’ సెట్స్‌పై ఉన్నాయి. ఇందులో ‘ఆదిపురుష్’ విష‌యానికి వ‌స్తే ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, రావ‌ణాసురుడిగా సైఫ్ అలీఖాన్‌, సీత‌గా కృతిస‌న‌న్‌, ల‌క్ష్మ‌ణుడిగా స‌న్నీ సింగ్ న‌టిస్తున్నారు. కాగా.. తాజా స‌మాచారం మేర‌కు రావ‌ణాసురుడు త‌న‌యుడు మేఘ‌నాథుడు పాత్ర‌లో హిందీ బిగ్‌బాస్ విన్న‌ర్ సిద్ధార్థ్ శుక్లా న‌టించబోతున్నార‌ని టాక్‌. ముంబైలోని ప్ర‌వేట్ స్టూడియోలో షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ను హైద‌రాబాద్‌లో జ‌రుపుకోనుంది.