May 18 2021 @ 12:27PM

స్పార్క్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సినిమా

స్పార్క్ ఓటీటీలో బిగ్ బాస్ బ్యూటీ దివి వద్య నటించిన 'క్యాబ్ స్టోరీస్' రిలీజ్ కాబోతోంది. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు కేవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించారు. ఎస్ కృష్ణ నిర్మించగా సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఇటీవలే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసిన చిత్ర బృందం ఈ నెల 28న నేరుగా స్పార్క్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో దివి పాల్గొని ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ సంపాదించుకుంది. దాంతో ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. రీసెంట్‌గా స్పార్క్ ఓటీటీ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. ముందుగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'డి కంపెనీ' రిలీజవగా రికార్డ్ స్థాయిలో సబ్‌స్క్రైబర్స్‌ను రాబట్టింది. త్వరలో రిలీజ్ కాబోతున్న 'క్యాబ్ స్టోరీస్‌'కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.    


ఆంధ్రప్రదేశ్ మరిన్ని...