కోరిక తీరకుండానే మరణించిన Bigbull

ABN , First Publish Date - 2022-08-15T16:08:12+05:30 IST

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. స్టాక్ మార్కెట్‌(stock market)లో ఓ ట్రెండ్ సెట్టర్. రూ.5000లతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి

కోరిక తీరకుండానే మరణించిన Bigbull

Bigbull Rakesh Jhunjhunwala : రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా.. స్టాక్ మార్కెట్‌(stock market)లో ఓ ట్రెండ్ సెట్టర్. రూ.5000లతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి రూ.46 వేల కోట్లకు ఆయన పెట్టుబడులు(Investments) చేరుకున్నాయి. అయితే ఆయనకు ఒక కోరిక ఉండేది. అది తీరకుండానే బిగ్‌బుల్ మరణించారు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా దంపతులకు చాలా లేటుగా అంటే వివాహమైన 17 ఏళ్ల తర్వాత రాకేశ్‌ దంపతులకు 2004లో సంతానం కలిగింది. అప్పుడు ఒక కూతురు జన్మించగా.. ఆమెకు నిష్ట అని పేరు పెట్టుకున్నారు. అనంతరం 2009లో ఇద్దరు కవలలు జన్మించారు. వారికి ఆర్యమాన్‌.. ఆర్యవీర్‌ అని పేరు పెట్టారు.


రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు తన కుమారులిద్దరంటే చాలా ఇష్టం. వారిని పాతికేళ్ల వారయ్యాక చూడాలని కోరుకుంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బుల్ వెల్లడించారు. 2010లో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రాకేశ్‌ ఈ విషయాన్ని తెలిపారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం కుమారులిద్దరికీ దాదాపు పదమూడేళ్లు. మరో 12 ఏళ్లు ఆయన జీవించి ఉంటే కోరిక తీరి ఉండేది. హైదరాబాద్‌(Hyderabad)లో ఒక రాజస్థానీ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అంతా ముంబైలోనే జరిగింది. 


డిగ్రీ చదువుతున్న రోజుల్లో 1985లో ఒక బంధువు నుంచి రూ.5,000 అప్పు తీసుకుని స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు ప్రారంభించారు. అప్పుడు 150 పాయింట్లుగా ఉన్న బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఇప్పుడు 59,000 పాయింట్లు మించి పోయింది. చార్టెడ్‌ అకౌంటెన్సీ (సీఏ) పూర్తి చేసినా ఝున్‌ఝున్‌వాలా షేర్‌ మార్కెట్‌ పెట్టుబడులనే తన ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. ఆయన ఫలానా కంపెనీ షేర్లు కొన్నారని తెలిస్తే వెంటనే ఆ షేర్లలో ర్యాలీ ప్రారంభమయ్యేది.


Updated Date - 2022-08-15T16:08:12+05:30 IST