బిగ్‌ త్రీకి సవాల్‌!

ABN , First Publish Date - 2020-11-25T09:47:47+05:30 IST

న్ని్‌సలో బిగ్‌ త్రీగా ఖ్యాతికెక్కిన రోజర్‌ ఫెడరర్‌, నొవాక్‌ జొకోవిచ్‌, రఫెల్‌ నడాల్‌దే ఇన్నాళ్లూ ఆధిపత్యం. ఏ టోర్నీ ఫైనలైనా ఆ ముగ్గురిలో ..

బిగ్‌ త్రీకి  సవాల్‌!

లండన్‌: టెన్ని్‌సలో బిగ్‌ త్రీగా ఖ్యాతికెక్కిన రోజర్‌ ఫెడరర్‌, నొవాక్‌ జొకోవిచ్‌, రఫెల్‌ నడాల్‌దే ఇన్నాళ్లూ ఆధిపత్యం. ఏ టోర్నీ ఫైనలైనా ఆ ముగ్గురిలో ఇద్దరు ఉండాల్సిందే. అయితే, ఇదంతా గతమను కోవాల్సిందేనేమో! ఇకనుంచి ఈ బిగ్‌త్రీకి చెక్‌పడడం ఖాయమేనట. కారణం.. 2021 సీజన్‌లో పురుషుల సింగిల్స్‌లో కొత్త చాంపియన్లు తారాజువ్వల్లా దూసుకొచ్చే అవకాశం ఉందనే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. ఈ సీజన్‌ చివర్లో జరిగిన ఏటీపీ ఫైనల్స్‌లో డేనియల్‌ మెద్వెదెవ్‌ (రష్యా), డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) తుది పోరుకు చేరడమే అందుకు నిదర్శనమని టెన్నిస్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇకనుంచి థీమ్‌, మెద్వెదెవ్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) లాంటి యువతరానిదే జోరని అంచనా వేస్తున్నారు.


20 ప్లస్‌లో ఉన్న వీరు టెన్ని్‌సలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారని భావిస్తున్నారు. వీరితోపాటు స్టెఫనోస్‌ సిట్సిపాస్‌, ఆండ్రీ రుబలెవ్‌ కూడా యువతరానికి సారథుల్లా కనిపిస్తున్నారు. టెన్ని్‌సలో తమదైన ముద్ర వేయడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆరంభమయ్యే వరకు టెన్నిస్‌ అభిమానులకు ఇదో హాట్‌ టాపిక్‌ అయ్యే అవకాశం ఉంది. ‘దిగ్గజాలతో ఆడగలం.. వారిని ఓడించగలమని నిరూపించాం. మేజర్‌ టోర్నీల్లోనూ వారిని దీటుగా ఎదుర్కొంటాం’ అని ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ విజేత థీమ్‌ అన్నాడు. రానున్న రోజుల్లో టెన్ని్‌సలో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందని అతను ధీమా వ్యక్తం చేశాడు. గతవారం ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ సెమీస్‌లో జొకోవి చ్‌ను థీమ్‌, నడాల్‌ను మెద్వెదెవ్‌ ఓడించి ఫైనల్లో తలపడ్డారు. ‘కొత్తం తరం సాధించింది’ అని నడాల్‌పై నెగ్గిన తర్వాత మెద్వెదెవ్‌ అన్నాడు. ఆ టోర్నీలో మెద్వెదెవ్‌ విజేతగా నిలిచాడు. మొత్తంగా యువతరం వెలుగులోకి రావడం టెన్నిస్‌కు మేలు చేసేదే.

Updated Date - 2020-11-25T09:47:47+05:30 IST