Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిన్నోడికి... పెద్ద షాక్... పెరగనున్న బీమా పాలసీ ధరలు...

హైదరాబాద్ : కోవిడ్ నేపధ్యంలో ‘బీమా’కు ప్రాధాన్యత పెరిగిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో... కోవిడ్ తర్వాత బీమా గురించి సమాచారాన్ని కోరుకునే వారి సంఖ్య ఏడు రెట్లు పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది. గతంలో కేవలం పది శాతం మంది మాత్రమే బీమాను కొనుగోలు చేయాలని భావించగా, ఇప్పుడది 71 శాతానికి పెరిగింది. ఈ క్రమంలో... ఇన్సూరెన్స్ సమాధాన్ సహ వ్యవస్థాపకుడు శైలేష్ కుమార్ ఒక స్థూల అంచనాను వెల్లడించారు. కంపెనీలు ఒక సంవత్సరంలో 3-4 వేల డెత్ క్లెయిమ్‌లను కలిగి ఉంటే, కోవిడ్ వ్యాప్తి సమయంలో 20 వేల డెత్ క్లెయిమ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పెరుగుదలను రీ-ఇన్సూరెన్స్ కంపెనీలకు నష్టం కలిగించే ఒప్పందంగా పరిగణిస్తున్నారు. రీ-ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే మన బీమా కంపెనీ ప్రీమియం చెల్లింపుపై బీమాను తిరిగి బీమా చేస్తుంది. అంటే మన బీమాపై పెద్ద కంపెనీల నుంచి తనకు తానుగా బీమాను కొనుగోలు చేస్తుంది.


అంటే... మనం బీమాను క్లెయిమ్ చేసినప్పుడు రీ-ఇన్సూరెన్స్ కంపెనీ ఆ డబ్బును మన బీమా కంపెనీకి ఇస్తుంది. మ్యూనిచ్ రీ, లాయిడ్ స్విస్ వంటి దాదాపు పది విదేశీ రీ-ఇన్స్యూరెన్స్ కంపెనీలున్నాయి. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉంది. ఈ కంపెనీలకు భారత్‌లో మాత్రమే బీమా క్లెయిమ్‌లు లేవు. అయితే... బీమా క్లెయిమ్‌లు ప్రపంచం నలుమూలల నుండి వస్తాయన్న విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా ప్రతీ  మార్కెట్‌కు ఎక్కువ క్లెయిమ్‌లు వచ్చాయి. కానీ భారతదేశంలో ఎక్కువ క్లెయిమ్‌లు సమస్యగా ఉండటమే కాకుండా, మరో రకమైన నష్టాన్ని కూడా చవిచూడాల్సి వచ్చింది. నష్ట ఒప్పందాన్ని చూసి, రీ-ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంను ‘ప్రియం’ చేశాయి. ఆరోగ్య బీమా ‘ఖరీదు’ కావడానికి ఇదే కారణమైంది. వార్షిక ప్రీమియం రూ. 15 వేలలో 25 % పెరిగితే, రూ. 3,750 లను అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియంలో 30 శాతం పెంపు ఉంటే... ప్రీమియం రూ. 4,500, నలభై శాతం పెరిగితే ప్రీమియం రూ. 6 వేల మేర పెరుగుతాయి. 

Advertisement
Advertisement