ఎయిర్‌లైన్స్‌‌కు భారీ ఉపశమనం.. తగ్గిన ఇంధన ధరలు

ABN , First Publish Date - 2022-07-17T00:53:05+05:30 IST

విమానయాన సంస్థలకు ఇది శుభవార్తే. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) శనివారం జెట్ ఇంధన ధరలను 2.2

ఎయిర్‌లైన్స్‌‌కు భారీ ఉపశమనం.. తగ్గిన ఇంధన ధరలు

న్యూఢిల్లీ: విమానయాన సంస్థలకు ఇది శుభవార్తే. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) శనివారం జెట్ ఇంధన ధరలను 2.2 శాతం తగ్గించాయి. విమానాలు ఎగిరేందుకు అవసరమైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర కిలోలీటర్‌కు రూ.3,084.94(2.2శాతం) తగ్గించింది. ఫలితంగా కిలోలీటర్‌కు ఇంధనం ధర రూ. 138,147.93కి దిగొచ్చింది. ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.138,147.95 ఉండగా, ముంబైలో ఏకంగా రూ. 137,095.74కి తగ్గింది. జెట్ ఇంధన ధరలు తగ్గడం ఈ ఏడాది ఇది రెండోసారి.


విమాన ఇంధన ధరలు ఈ ఏడాది జూన్‌లో కిలోలీటర్‌కు గరిష్ఠంగా 141,232.87కి చేరుకున్నాయి. స్థానిక పన్నుల నేపథ్యంలో రాష్ట్రానికి, రాష్ట్రానికి మధ్య ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల ఆధారంగా  ఏటీఎఫ్ ధరలను ప్రతి నెల 1వ తేదీ, 16వ తేదీల్లో సవరిస్తారు. అయితే, ఈ నెల 1న మాత్రం ధరలను సవరించలేదు. అంతకు ముందు  ఎన్నడూ లేనంతగా 16శాతం పెంచడంతో ధరలు ఆల్‌టైం హైకి చేరుకున్నాయి.  

Updated Date - 2022-07-17T00:53:05+05:30 IST