Apr 23 2021 @ 12:54PM

నాని సినిమాకి భారీ ఆఫర్..!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. ఈ సినిమాలో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తుండగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి నాని మార్కెట్ కంటే మించి బడ్జెట్ కేటాయించినట్టు చెప్పుకుంటున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందిస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన నాని ఫస్ట్ లుక్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. దాంతో 'శ్యామ్ సింగ రాయ్' నాన్ థియేట్రికల్ రైట్స్‌కి భారీ ఆఫర్ వచ్చినట్టు సినీ వర్గాలు చెప్పుకుంటున్నారట. 'శ్యామ్ సింగ రాయ్' సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌కు 30 కోట్లకు పైగానే ఆఫర్ రాగా నిర్మాత ఇప్పుడే రైట్స్ అమ్మదలచుకోలేదని తెలుస్తోంది. టీజర్ - ట్రైలర్ .. అలాగే ప్రమోషన్స్ మొదలయ్యాక.. అప్పడు ఉన్న డిమాండ్‌ను బట్టి 'శ్యామ్ సింగ రాయ్' నాన్ థియేట్రికల్ రైట్స్ ఇవ్వాలని చూస్తున్నాడట. కాగా 'శ్యామ్ సింగ రాయ్' ప్రస్తుతం ఫైనల్ షెడ్యుల్ షూటింగ్ జరుగుతోంది. ఇక త్వరలో నాని - శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన 'టక్ జగదీష్' ప్రేక్షకుల ముందుకు రానుంది.