TRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలకనేత..!

ABN , First Publish Date - 2022-05-19T18:28:05+05:30 IST

తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ ఓవైపు పుకార్లు షికార్లు చేస్తుండటం..

TRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలకనేత..!

హైదరాబాద్ సిటీ : తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ ఓవైపు పుకార్లు షికార్లు చేస్తుండటం.. మరోవైపు నియోజకవర్గంలో ఒకరంటే ఒకరికి పడకపోవడంతో నేతలు (Leaders) పక్క పార్టీలోకి జంప్ చేయడానికి సిద్ధమవుతుండటంతో టి. పాలిటిక్స్ మరింత హాట్ హాట్‌గా మారాయి. ఇప్పటికే అటు అధికార పార్టీలోని.. ఇటు ప్రతిపక్ష పార్టీల్లోని పలువురు అసంతృప్త నేతలంతా సొంత పార్టీలకు గుడ్ బై (Good Bye) చెప్పేసేందుకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఆ పార్టీకి బిగ్ షాక్ (Big Shock) తగిలింది.


టీఆర్ఎస్‌కు టాటా.. కాంగ్రెస్‌లోకి..!

టీఆర్ఎస్ సీనియర్ నేత (Senior Leader), సీఎం కేసీఆర్‌ (CM KCR) సన్నిహితుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు (Nallala Odelu).. పార్టీకి టాటా చెప్పేశారు. మరికొన్ని గంటల్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), కీలక నేత దామోదర రాజనర్సింహాతో కలిసి ఓదేలు ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ (Congress) అగ్రనేత, యువనేత రాహుల్‌గాంధీని (Rahul Gandhi) వీరంతా కలవబోతున్నారు. ఓదేలుకు.. రాహుల్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన కోరిన నియోజవర్గం నుంచి టికెట్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని విశ్వసనీయవర్గాల సమాచారం. చేరిక అనంతరం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియా మీట్ ఏర్పాటు చేసి అసలు తానెందుకు టీఆర్ఎస్‌ను వదలాల్సి వచ్చిందనే విషయాలు నిశితంగా వివరించున్నారని తెలుస్తోంది.


ఆయనతో విభేదాలు..!

కాగా.. నల్లాల ఓదేలు టీఆర్ఎస్ (TRS Party) ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉండి కీలకనేతగా ఎదిగారు. 2009, 2014 ఎన్నికల్లో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఓదేలు రెండుసార్లూ గెలుపొందారు. అయితే.. 2018లో ఈయనకు కేసీఆర్ సర్కార్ టికెట్ ఇవ్వలేదు. ఈయనకు బదులుగా చెన్నూరు టికెట్ బాల్క సుమన్‌కు (Balka Suman) ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం. నాటి నుంచే ఈయన పార్టీమారాలని చూస్తున్నట్లు పెద్ద ఎత్తునే వార్తలు వచ్చాయి కానీ.. ఆయన ఏ మాత్రం స్పందించకుండా.. పైగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనకుండా మిన్నకుండిపోయారు. అయితే.. ఇవన్నీ ఒక ఎత్తయితే చెన్నూరు నుంచి గెలిచిన బాల్కసుమన్‌తో రెండ్రోజులకోసారి విభేదాలు వచ్చేవి. ఇవన్నీ అధిష్టానానికి చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఆయన అనుచరులు వాపోతున్నారు. అయితే ఈ చిన్న చిన్న విభేదాలు కాస్త చిలికి చిలికి గాలివానలా మారి పార్టీ మారే పరిస్థితికి వచ్చాయి. ఈ మధ్యనే టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు టచ్‌లోకి వెళ్లిన ఓదేలు కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్నట్లు తన మనసులోని చెప్పారట. ఓదేలు అలా చెప్పడంతో రేవంత్ వెంటనే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్‌ తీసుకున్నారట. ఇవాళ పార్టీలో చేరాలని ఓదేలు ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్నారు.


ఎక్కడి వరకూ వెళ్తుందో..!

ఇదిలా ఉంటే.. ఓదేలుతో పాటు మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న ఆయన భార్య భాగ్యలక్ష్మీ కూడా పార్టీ మారుతారని తెలుస్తోంది. ఈమెతో పాటు పలువురు ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన పలువురు నేతలు కూడా పార్టీ మారాలనే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. అయితే.. కీలక నేతగా పేరున్న ఓదేలు పార్టీకి గుడ్ బై చెప్పేయడం టీఆర్ఎస్ బిగ్ షాకేనని చెప్పుకోవాలి. కాగా.. ఆయన పార్టీ మారుతున్నట్లు అధిష్టానానికి తెలిసినా ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదని టాక్ నడుస్తోంది. అయితే అధికార పార్టీ నుంచి ఈ మధ్య ఎలాంటి జంపింగ్‌లు జరగలేదు. అయితే ఓదేలుతో ప్రారంభమైన ఈ జంపింగ్‌ ఎక్కడి వరకూ వెళ్తుందో వేచి చూడాల్సిందే. అధికార పార్టీ నుంచి చాలా మంది ప్రముఖులు కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నారని త్వరలో చేరికలు ఉంటాయని ఈ మధ్య తెలంగాణ కీలక నేతలు చెబుతున్న విషయం విదితమే.



Updated Date - 2022-05-19T18:28:05+05:30 IST