Abn logo
May 6 2020 @ 19:41PM

భారీ డిజిట‌ల్ డీల్‌..?

అంద‌రిలో ఆస‌క్తి పెంచుతోన్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ ఒకటి . క‌న్న‌డ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1’ పాన్ ఇండియా రేంజ్‌లో సాధించిన స‌క్సెస్‌తో రెండో పార్ట్‌పై భారీ అంచ‌నాలున్నాయి. అంచనాలకు త‌గ్గ‌ట్లు నిర్మాత‌లు భారీ బ‌డ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. సంజ‌య్ ద‌త్‌, ర‌వీనాటాండ‌న్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. క‌రోనా ప్ర‌భావం లేకుంటే ఈ సినిమా ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో విడుద‌ల కావాల్సింది. కానీ సినిమా తుది ద‌శ షూటింగ్ క‌రోనా వ‌ల్ల ఆగింది. తాజా స‌మాచారం మేర‌కు ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్‌2’ అన్నీ భాష‌లు(తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌) క‌లిపి రూ.55 కోట్ల‌కు డిజిట‌ల్ హ‌క్కుల‌ను ఇవ్వాలనే డీల్ పెట్టింద‌ట‌. మ‌రి దీనిపై నిర్మాత‌లు నిర్ణ‌యం తీసుకోలేద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement