జనవరి 17 వరకు బిగ్‌ సి ‘కోటి’ ఆఫర్‌

ABN , First Publish Date - 2020-10-24T07:28:32+05:30 IST

దసరా, దీపావళి, ఇతర పండగలను పురస్కరించుకుని బిగ్‌ సి 6 లక్కీ డ్రాలలో 100 మం ది ఖాతాదారులను ఎంపిక చేసి ఒక్కక్కరికి రూ.లక్ష చొప్పున బహుమతి ఇవ్వనుంది...

జనవరి 17 వరకు బిగ్‌ సి ‘కోటి’ ఆఫర్‌

  • మొదటి డ్రా విజేతల ప్రకటన

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దసరా, దీపావళి, ఇతర పండగలను పురస్కరించుకుని బిగ్‌ సి 6 లక్కీ డ్రాలలో  100 మంది ఖాతాదారులను ఎంపిక చేసి ఒక్కక్కరికి రూ.లక్ష చొప్పున బహుమతి ఇవ్వనుంది. ‘గెలుచుకోండి.. కోటి రూపాయ’ల ఆఫర్‌కు విశేష స్పందన లభిస్తోందని, ఈ నెల 10న ప్రారంభమైన ఈ ఆఫర్‌ జనవరి 17 వరకూ ఉంటుందని బిగ్‌ సి వ్యవస్థాపకుడు, సీఎండీ ఎం బాలు చౌదరి తెలిపారు. శుక్రవారం మొదటి లక్కీడ్రా తీశామని.. ఇందులో 9 మంది కస్టమర్లను ఎంపిక చేశామని చెప్పారు. ఐఫోన్స్‌, వన్‌ప్లస్‌ మొబైల్స్‌ కొనుగోలుపై రూ.3,000 వరకు హెచ్‌డీఎ్‌ఫసీ క్యాష్‌బ్యాక్‌, ఒప్పో మొబైల్స్‌ కొనుగోలుపై 10 శాతం వరకూ క్యాష్‌ బ్యాక్‌తో పాటు వడ్డీ లేకుండా మొబైల్‌ కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. షామీ మొబైల్‌ ఫోన్లపై 10 శాతం ఎస్‌బీఐ క్యాష్‌ బ్యాక్‌, రూ.5,000 వరకూ డిస్కౌంట్‌ వంటి ఆఫర్లు కూడా ఉన్నాయి.  

Updated Date - 2020-10-24T07:28:32+05:30 IST