Jul 25 2021 @ 10:13AM

రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్‌ ఫేమ్ యాషికా ఆనంద్‌కి తీవ్ర గాయాలు

తాజాగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్‌ ఫేమ్ యాషికా ఆనంద్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తమిళనాడులో చోటు చేసుకుంది. యాషికా తన స్నేహితురాలు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వల్లిశెట్టి భవాని, మరొకరు కారులో ప్రయాణిస్తుండగా.. చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో యాషికా ఆనంద్‌ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వల్లిశెట్టి భవాని మృతి చెందారు. మద్యం మత్తులో కారు వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన యాషికా ఆనంద్‌తో పాటు మరో ఇద్దరిని చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, యాషికా ఆనంద్.. ఫ్యాషన్ మోడల్‌, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించింది. 2016లో 'దురువంగల్ పత్తినారు' మూవీతో కోలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో అడల్ట్ కామెడీ మూవీ 'ఇరుట్టు అరైయిల్ మురట్టు' సినిమాతో క్రేజీ స్టార్‌గా మారిన ఆమె బిగ్ బాస్ 2 తమిళ్ సిరీస్‌లో పాల్గొని ప్రేక్షకులకు బాగా చేరువైంది.