Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 15 Dec 2021 12:01:10 IST

మిడిల్ ఫింగర్ చూపిస్తూ బిగ్‌బాస్ బ్యూటీ వీడియో.. దారుణంగా ట్రోల్ చేసిన ఫ్యాన్స్

twitter-iconwatsapp-iconfb-icon

ఇటీవల ‘బిగ్‌బాస్’ ఫేమ్ ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందులోనూ విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ.. ఎక్కువగా ట్రోలింగ్‌కి గురవుతోంది. గత ఆదివారం ఆ బ్యూటీ అలాంటి ఓ వీడియోని ట్రోల్ చేశారు నెటిజన్లు. తాజాగా మరోసారి అలాంటి అనుభవమే ఎదురైంది ఈ భామకి.


యూట్యూబ్‌లో విడుదలై మంచి ఆదరణ పొందిన సాంగ్ ‘ఏబీసీడీఈఎఫ్‌యూ’. ఓ అమెరికన్ సింగర్ పాడిన ఈ పాటకి రీల్ చేసి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉర్ఫీ. అందులో ఆ పాటకి లిప్ సింక్ ఇస్తూ మిడిల్ ఫింగర్ చూపించింది ఈ బ్యూటీ. అంతేకాకుండా ఈ వీడియోలో నీలి రంగు బికీనీ టాప్‌పై నెట్‌ని ధరించింది. దీనిపై విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు.


అందులో.. ‘పండ్లను అమ్మేవాళ్లు ఉపయోగించే నెట్ ఇదేనా’ అంటూ కొందరు.. ‘మీకు చలి వేయట్లేదా ఏంటి?’ అంటూ మరికొందరు.. ‘మేడం.. మీకు ఇలాంటి బట్టలు ఎక్కడా దోరుకుతాయం’టూ ఇంకొందరు.. మరి కొందరు అయితే మార్వెల్ మూవీ ‘నో వే హోమ్’ని గుర్తు చేస్తూ ‘స్పైడర్ మ్యాన్ నిన్ను చూసి నీకోసం ఆ నెట్‌ని తీసుకొచ్చినట్లు ఉన్నాడ‌’ని కామెంట్స్ పెట్టారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement