May 22 2020 @ 12:16PM

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ వీరేనా?

 ప్ర‌ముఖ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌వుతున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో మూడు సీజ‌న్స్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యాయి. నాలుగో సీజ‌న్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియ‌డం లేదు. కానీ బిగ్‌బాస్ సీజ‌న్ 4కు సంబంధించిన స‌భ్యుల‌ను ఎంపిక చేయ‌డానికి నిర్వాహ‌కులు స‌న్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇందులో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్‌ను సంప్ర‌దించార‌ట‌. హీరో త‌రుణ్‌, జాహ్న‌వి, మంగ్లీ, వ‌ర్షిణి, అఖిల్ శ్ర‌త‌క్‌, యాంక‌ర్ శివ బిగ్‌బాస్ సీజ‌న్ 4లో పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. సీజ‌న్ 3కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జునే సీజ‌న్ 4కి కూడా వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలున్నాయంటున్నారు. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే జూన్‌లో సీజ‌న్ 4 స్టార్ట్ అయ్యే అవ‌కాశాలుండేవి. కానీ క‌రోనా ప్ర‌భావంతో ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందో ఇప్ప‌డే చెప్ప‌లేక‌పోతున్నార‌ట‌. త్వ‌రలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంద‌ని టాక్‌.