‘ఉబెర్‌ ’లో ‘బిగ్‌బాస్కెట్‌’ హోండెలివరీ

ABN , First Publish Date - 2020-04-03T09:29:04+05:30 IST

లాక్‌డౌన్‌ వేళ ప్రజలకు నిత్యవసరాలను ఇంటివద్దకే అందించే ఉద్దేశంతో రెండు దిగ్గజ సంస్థలు చేతులు కలిపాయి. క్యాబ్‌ దిగ్గజం ఉబెర్‌.. సూపర్‌ మార్కెట్‌...

‘ఉబెర్‌ ’లో ‘బిగ్‌బాస్కెట్‌’ హోండెలివరీ

లాక్‌డౌన్‌ వేళ ప్రజలకు నిత్యవసరాలను ఇంటివద్దకే అందించే ఉద్దేశంతో రెండు దిగ్గజ సంస్థలు చేతులు కలిపాయి. క్యాబ్‌ దిగ్గజం ఉబెర్‌.. సూపర్‌ మార్కెట్‌ దిగ్గజం బిగ్‌బాస్కెట్‌తో జతకలిసింది. బిక్‌బాస్కెట్‌కు వచ్చిన సరుకుల ఆర్డర్లను ఉబెర్‌ ప్రజల ఇళ్లకు చేరుస్తుంది. ఇందుకుగాను ఉబెర్‌.. బైకులు, కార్లు ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేసేందుకే తాము బిగ్‌బాస్కెట్‌తో కలిసి పనిచేస్తున్నామని, ఇందుకుగాను ఎలాంటి సర్వీస్‌ చార్జీ వసూలు చేయడం లేదని ఉబెర్‌ సౌత్‌ ఏషియా డైరెక్టర్‌ ప్రభ్‌జీత్‌సింగ్‌ తెలిపారు.

 

Updated Date - 2020-04-03T09:29:04+05:30 IST