Abn logo
Dec 3 2020 @ 01:00AM

టాటా గూటికి బిగ్‌బాస్కెట్‌!

80%వాటా కొనుగోలు చేసే చాన్స్‌ 

రూ.13 వేల కోట్ల ఒప్పందం 

త్వరలోనే అధికారిక ప్రకటన 


ముంబై: దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్‌ కిరాణా ప్లాట్‌ఫామ్‌ బిగ్‌బిస్కెట్‌.. త్వరలోనే టాటాల చేతుల్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. బిగ్‌బాస్కెట్‌లో 80 శాతం వాటాను టాటా గ్రూప్‌ 130 కోట్ల డాలర్లకు (రూ.13,000 కోట్ల పైమాటే) కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. ఇరువర్గాల మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయని, అతి త్వరలో అధికారిక ప్రకటన వెలువడవచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్‌లో భాగంగా బిగ్‌బాస్కెట్‌ మార్కెట్‌ విలువను 160 కోట్ల డాలర్లుగా లెక్కగట్టే అవకాశం ఉంది.  అయితే, ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు టాటా ప్రతినిధి నిరాకరించగా.. బిగ్‌బాస్కెట్‌ మాత్రం స్పందించలేదు. చైనా ఇన్వె్‌స్టమెంట్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ సహా పలు అంతర్జాతీయ ఫండ్లు ఈ ఆన్‌లైన్‌ మార్ట్‌లో పెట్టుబడులు కలిగి ఉన్నాయి. 

Advertisement
Advertisement
Advertisement