BIG B : పాన్ మసాలా యాడ్ ఎందుకు చేశానంటే...
ABN , First Publish Date - 2021-09-18T22:37:09+05:30 IST
యాడ్స్ చేయటం వల్ల నటీనటులకు బోలెడు డబ్బులు వస్తాయి. కానీ, అదే సమయంలో కొన్ని విమర్శలు, కొత్త సమస్యలు కూడా అప్పుడప్పుడూ వస్తుంటాయి. అటువంటి అనుభవం ఈసారి అమితాబ్ బచ్చన్‌కు ఎదురైంది. ఆయన తాజాగా చేసిన ఓ పాన్ మసాలా యాడ్ విమర్శలకు కారణమైంది. సొషల్ మీడియాలో ఓ అభిమాని నేరుగా బిగ్ బీని ప్రశ్నించాడు కూడా...

తనని పాన్ మసాలా యాడ్ ఎందుకు చేశారంటూ సూటిగా ప్రశ్నించిన ఫ్యాన్‌కి సీనియర్ బచ్చన్ కూడా సీరియస్‌గానే సమాధానం ఇచ్చారు. ఎటువంటి దాపరికం, మొహమాటం లేకుండా తన చర్యని ఆయన సమర్థించుకున్నారు. ‘‘ఎవరైనా ఏదైనా వ్యాపారం విజయవంతంగా చేస్తుంటే, వారితో భాగస్వాములు అయ్యేందుకు మనం వెనుకాడాల్సిన పని లేదు’’ అన్నారు బిగ్ బి. అంతే కాదు, తనకి ప్రచారం చేసినందుకుగానూ డబ్బులు వస్తున్నాయని తేల్చి చెప్పిన బాలీవుడ్ స్టార్, అదే సమయంలో, పాన్ మసాలా ఉత్పత్తి వల్ల ఆ పరిశ్రమలో ఎంతో మంది ఉపాధి పొందుతారని ఎత్తి చూపారు. వారికి ఆదాయం కూడా వస్తోందని గుర్తు చేశారు.