Viral Video: ఉదయం పూట వాకింగ్ కోసం నీటి మడుగు నుంచి బయటికొచ్చిన మొసలి!

ABN , First Publish Date - 2022-04-24T01:37:12+05:30 IST

నీళ్లలో కాలక్షేపం కాలేదో ఏమో తెలియదు కానీ ఓ మొసలి నేలపైకి వచ్చి సరదాగా వాకింగ్ చేసింది. ప్రస్తుతం ఆ మొసలి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఉదయం పూట వాకింగ్ కోసం నీటి మడుగు నుంచి బయటికొచ్చిన మొసలి!

ఇంటర్నెట్ డెస్క్: నీళ్లలో కాలక్షేపం కాలేదో ఏమో తెలియదు కానీ ఓ మొసలి నేలపైకి వచ్చి సరదాగా వాకింగ్ చేసింది. ప్రస్తుతం ఆ మొసలి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



సుమారు 10 అడుగుల పొడవు ఉన్న ఓ మొసలి.. గత ఆదివారం ఉదయం నీటి మడుగు నుంచి బయటకు వచ్చింది. అనంతరం మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుంటూ స్థానికంగా ఉన్న ఇళ్ల ముందు వాకింగ్ చేసింది. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడకు (నీటి మడుగులోకి) వెళ్లిపోయింది. ఫ్లోరిడాలోని వెనీస్‌లో జరిగిన ఈ ఘనకు సంబంధించిన దృశ్యాలను స్థానిక షరీఫ్ ఆఫీస్ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఆ మొసలికి ఆకలై బయటికి వొచ్చుంటుంది. అది బయట తిరిగే సమయంలో ఎవరైనా దాని కంట పడుంటే వారి పనైపోయేది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఫ్లోరిడాలో మొసళ్ల సంచారం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే.




Updated Date - 2022-04-24T01:37:12+05:30 IST