‘అమెజాన్‌’ పై బైడెన్ ఫైర్! ఈ పరిస్థితికి చెక్ పెడతా అంటూ..

ABN , First Publish Date - 2021-04-02T02:38:17+05:30 IST

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజాగా మండిపడ్డారు.

‘అమెజాన్‌’ పై బైడెన్ ఫైర్! ఈ పరిస్థితికి చెక్ పెడతా అంటూ..

వాషింగ్టన్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా మండిపడ్డారు. అమెరికా చట్టాల్లోని లోపాలను అడ్డం పెట్టుకుని అమెజాన్ ఫెడరల్ పన్ను ఎగ్గొడుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ టాప్ 500 కంపెనీల్లో ఒకటైన అమెజాన్ చట్టాల్లోని లోపాలను అడ్డం పెట్టుకుని  ఒక్క పైసా పన్ను కూడా చెల్లించడ్లేదు.  టీచర్, ఫైర్‌మ్యాన్ వంటి సామాన్య ఉద్యోగులు 20 శాతానికిపైగా పన్ను చెల్లిస్తున్నారు. కానీ అమెజాన్ వంటి కార్పొరేట్లు మాత్రం ఒక్కపైసా ఫెడరల్ ట్యాక్స్ కూడా చెల్లించట్లేదు. నేను ఈ పరిస్థితికి చెక్ పెడతా’ అని ఆయన వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియాలో బుదవారం నాడు చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మౌలిక వసతుల అభివృద్దికి సంబందించి ఇటీవలే బైడెన్ ప్రభుత్వం ఓ విధాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 21 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును 28 శాతానికి పెంచుతామని ప్రకటించింది. అంతేకాకుండా.. పన్ను చెల్లింపుకు సంబంధించిన చట్టాల్లోని లోటుపాట్లను కూడా సవరిస్తామని పేర్కొంది.  

Updated Date - 2021-04-02T02:38:17+05:30 IST