మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి కట్టబెట్టనున్న అమెరికా అధ్యక్షుడు..!

ABN , First Publish Date - 2022-05-27T01:23:16+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో భారత సంతతి వారి ప్రాముఖ్యం పెరుగుతోంది. తాజాగా మరో ఇండియన్ అమెరికన్‌కు బైడెన్ ప్రభుత్వంలో కీలక పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.

మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి కట్టబెట్టనున్న అమెరికా అధ్యక్షుడు..!

ఎన్నారై డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో భారత సంతతి వారి ప్రాముఖ్యం పెరుగుతోంది. తాజాగా మరో ఇండియన్ అమెరికన్‌కు బైడెన్ ప్రభుత్వంలో కీలక పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. స్లోవేకియాకు కొత్త రాయబారిగా గౌతమ్ రాణాను ఎంపిక చేసేందుకు బైడెన్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ కీలక  ప్రకటన చేసింది. రాణాను రాయబారిగా నామినేట్ చేసేందుకు బైడెన్ రెడీ అయ్యారని తెలిపింది.


అమెరికా విదేశాంగా శాఖలో సీనియర్ అధికారి అయిన రాణా.. ప్రస్తుతం ఆల్జీరియాలోని అమెరికా ఎంబసీలో డిప్యూటీ చీఫ్‌గా సేవలందిస్తున్నారు. అయనకు గతంలోనే స్లేవేనియాలో పనిచేసిన అనుభవం ఉంది. యూనివర్శిటీ ఆఫ్  పెన్సీల్వేనియా నుంచి డిగ్రీ పట్టా పొందిన ఆయన.. నేషనల్  డిఫెన్స్ యూనివర్శిటీలో ఎమ్మే చేశారు. ఇంగ్లీష్‌తో పాటూ హిందీ, స్పానిష్, గుజరాతీ భాషల్లో ఆయనకు మంచి పట్టు ఉంది. ఇక గతనెలలోనే బైడెన్.. భారత సంతతికి చెందిన రచనా సచ్‌దేవాను మాలీ రాయబారిగా నియమించిన విషయం తెలిసిందే. 



Updated Date - 2022-05-27T01:23:16+05:30 IST