గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్

ABN , First Publish Date - 2021-02-25T15:34:21+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై ఉన్న నిషేధాన్ని బుధవారం ఎత్తివేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు అమెరికాలోకి ప్రవేశించకుండా వారిపై నిషేధాన్ని విధించారు. కరోనా కారణంగా దేశంలో నిరుద్యోగం ఎక్కువైందని చెబుతూ ఆయన గతేడాది ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన బైడెన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై ఉన్న నిషేధాన్ని బుధవారం ఎత్తివేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు అమెరికాలోకి ప్రవేశించకుండా వారిపై నిషేధాన్ని విధించారు. కరోనా కారణంగా దేశంలో నిరుద్యోగం ఎక్కువైందని చెబుతూ ఆయన గతేడాది ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ట్రంప్ వాదనను జో బైడెన్ తిరస్కరిస్తూ తాజాగా ఈ నిషేధాన్ని రద్దు చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాలో అనేక కుటుంబాలు తిరిగి కలవలేకపోయాయని బైడెన్ చెప్పారు. అంతేకాకుండా ఈ నిషేధ ప్రభావం దేశంలోని వ్యాపారాలపై కూడా పడిందన్నారు. 




ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలను బైడెన్ ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విషయంలో ట్రంప్ తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని నీరుగార్చారని కాలిఫోర్నియాకు చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ కర్టిస్ మారిసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయాల వల్ల, కరోనా కారణంగా వీసా ప్రాసెసింగ్ దరఖాస్తుల బ్యాక్‌లాగ్ పెరిగిపోయిందని ఆయన అన్నారు. ఈ బ్యాక్‌లాగ్ సమస్యను తీర్చాలంటే సంవత్సరాల సమయం పడుతుందని, బైడెన్ ప్రభుత్వం ఈ అంశాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని కర్టిస్ మారిసన్ కోరారు.

Updated Date - 2021-02-25T15:34:21+05:30 IST