మరో భారతీయ సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించిన అమెరికా అధ్యక్షుడు!

ABN , First Publish Date - 2022-03-13T02:56:42+05:30 IST

మరో భారతీయ సంతతి వ్యక్తికి అమెరికా ప్రభుత్వంలో కీలక బాధ్యత లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. షెఫాలి రాజ్దాన్‌ దుగ్గల్‌ను నెదర్‌ల్యాండ్స్‌కు రాయబారిగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుడి అధికారిక నివాసం శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్ మూలాలు కలిగిన షెఫాలీ అమెరికాలో..

మరో భారతీయ సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించిన అమెరికా అధ్యక్షుడు!

ఇంటర్నెట్ డెస్క్: మరో భారతీయ సంతతి వ్యక్తికి అమెరికా ప్రభుత్వంలో కీలక బాధ్యత లభించింది.  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..  షెఫాలి రాజ్దాన్‌ దుగ్గల్‌ను నెదర్‌ల్యాండ్స్‌కు రాయబారిగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుడి అధికారిక నివాసం శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్ మూలాలు కలిగిన షెఫాలీ అమెరికాలో మానవ, మహిళా హక్కుల కార్యకర్తగా గతంలో విశేష సేవలు అందించారు. మునుపటి ఒబామా ప్రభుత్వంలో ఆమె.. యూనైటెడ్ స్టేట్స్ హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియమ్ కౌన్సిల్‌లో ప్రత్యేక సభ్యురాలిగా ఉన్నారు. మియామీ యూనివర్శిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్ విభాగంలో  బీఏ చేసిన షెఫాలీ.. న్యూయార్క్ యూనివర్శిటీలో మీడియా సైకాలజీలో ఎమ్మే చేశారు. ప్రస్తుత బైడెన్ ప్రభుత్వంలో ఆమె పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Updated Date - 2022-03-13T02:56:42+05:30 IST