ట్రంప్ VS బైడెన్

ABN , First Publish Date - 2020-06-07T13:18:57+05:30 IST

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌(77) డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ను ఢీకొననున్నారు.

ట్రంప్ VS బైడెన్

వాషింగ్టన్‌, జూన్‌ 6 : అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌(77) డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ను ఢీకొననున్నారు. సగానికి పైగా డెమోక్రాట్ల మద్దతును ఆయన కూడగట్టుకున్నారు. 3979 మంది ప్రతినిధులకుగాను 1991 మంది బైడెన్‌ అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. దీంతో అధ్యక్ష స్థానానికి ఆయన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టే. ఆగస్టులో విస్కాన్సిన్‌లో జరిగే డెమోక్రాటిక్‌ నేషనల్‌ కనెన్షన్‌లో బైడెన్‌ అభ్యర్థిత్వాన్ని లాంఛనంగా ప్రకటించడమే మిగిలింది. 

Updated Date - 2020-06-07T13:18:57+05:30 IST