Afghan Crisis: తన నిర్ణయాన్ని సమర్థించుకున్న బైడెన్

ABN , First Publish Date - 2021-08-23T17:37:12+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. మీడియా సమావేంలో మాట్లాడుతూ.. అఫ్ఘాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణను సమర్థించుకున్నారు. అక్కడి నుంచి

Afghan Crisis: తన నిర్ణయాన్ని సమర్థించుకున్న బైడెన్

వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. మీడియా సమావేంలో మాట్లాడుతూ.. అఫ్ఘాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణను సమర్థించుకున్నారు. అక్కడి నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. ఇప్పటి వరకు 30,300 మందిని అఫ్ఘాన్ నుంచి తరలించినట్టు బైడెన్ వివరించారు. ఈనెల 31 తర్వాత తరలింపు ప్రక్రియ కొనసాగింపుపై సైన్యంతో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాలిబన్లను మీరు విశ్వసిస్తున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బైడెన్ స్పందించారు. తాను ఎవరినీ నమ్మను అంటూ బదులిచ్చారు. అంతేకాకుండా తాలిబన్లకు నిధులు మంజూరు వారి వ్యవహారశైలిపై ఆధారపడి ఉంటుందని బైడెన్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-23T17:37:12+05:30 IST