భారత్ అంతర్జాతీయ శక్తిగా అవతరించడాన్ని స్వాగతిస్తున్నాం: యూఎస్

ABN , First Publish Date - 2021-02-10T20:45:53+05:30 IST

భారత్ అంతర్జాతీయ శక్తిగా అవతరించడాన్ని స్వాగతిస్తున్నామని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం ప్రకటించింది.

భారత్ అంతర్జాతీయ శక్తిగా అవతరించడాన్ని స్వాగతిస్తున్నాం: యూఎస్

వాషింగ్టన్: భారత్ అంతర్జాతీయ శక్తిగా అవతరించడాన్ని స్వాగతిస్తున్నామని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం ప్రకటించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అగ్రరాజ్యానికి భారత్ కీలక భాగస్వామి అని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని అమెరికా ఆకాంక్షించింది. 'ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మాకు భారత్ కీలక భాగస్వామి. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో భారత్ కీలక భూమిక పోషించాలని కోరుకుంటున్నాం. అదే సమయంలో భారత్ అంతర్జాతీయ శక్తిగా అవతరించడాన్ని కూడా స్వాగతిస్తున్నాం' అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకర్ల సమావేశంలో అన్నారు. అలాగే అమెరికాకు భారత్ ప్రధాన వాణిజ్య భాగస్వామి అని ప్రైస్ తెలిపారు. అంతేగాక భారత్‌లో ఎఫ్‌డీఐలకు యూఎస్ కంపెనీలు కేంద్రంగా ఉన్నా విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  


అంతకుముందు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ టోనీ బ్లింకెన్, భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా కృషి చేయడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహాయ సహకారాలు, మయన్మార్‌పై సైనిక చర్య.. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, వాతావరణ మార్పు, మహమ్మారి కరోనా సవాళ్లు తదితర అంశాలను ఈ సందర్భంగా వారు చర్చించుకున్నట్లు సమాచారం.  

Updated Date - 2021-02-10T20:45:53+05:30 IST