ఆశీల్‌మెట్ట అండర్‌పాస్‌లో ద్విచక్రవాహనాలకు ప్రవేశం లేదు

ABN , First Publish Date - 2021-12-06T04:41:12+05:30 IST

బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని ఆశీల్‌మెట్ట అండర్‌పాస్‌ నుంచి ద్విచక్రవాహనాల రాకపోకలను నిలిపి వేస్తున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు.

ఆశీల్‌మెట్ట అండర్‌పాస్‌లో ద్విచక్రవాహనాలకు ప్రవేశం లేదు
ఆశీల్‌మెట్ట అండర్‌పాస్‌

సీపీ మనీష్‌కుమార్‌సిన్హా

విశాఖపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని ఆశీల్‌మెట్ట అండర్‌పాస్‌ నుంచి ద్విచక్రవాహనాల రాకపోకలను నిలిపి వేస్తున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. ద్వారకానగర్‌ ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి బస్సుల రాకపోకలు పెరగడంతోపాటు అండర్‌పాస్‌ మీదుగా గొల్లలపాలెం నుంచి మద్దిలపాలెం వైపు వెళ్లే వాహనాలు, మద్దిలపాలెం వైపు నుంచి గొల్లలపాలెం వైపు వెళ్లే వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తుండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగా అండర్‌పాస్‌ ద్వారా రెండువైపుల నుంచి ద్విచక్రవాహనాలు ప్రవేశాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్టు సీపీ తెలిపారు. అటువైపు వె ళ్లి వచ్చే ద్విచక్రవాహనచోదకులు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్డును ఉపయోగించుకోవాలని సూచించారు. 


Updated Date - 2021-12-06T04:41:12+05:30 IST