Abn logo
Sep 27 2021 @ 01:10AM

బంగ్లా విముక్తిలో మేము సైతం..

ఏపీ ఆర్మీ బృంద సభ్యుల సైకిల్‌ ర్యాలీ

నగరానికి చేరిన సైనికుల సైకిల్‌ ర్యాలీ

వన్‌టౌన్‌, సెప్టెంబరు 26 : బంగ్లాదేశ్‌ విముక్తిలో భారత సైనికుల పాత్రను గుర్తు చేస్తూ సికింద్రాబాద్‌లోని ఏపీ ఆర్మీ బృంద సభ్యులు నిర్వహిస్తున్న సైకిల్‌  ర్యాలీ ఆదివారం విజయవాడకు చేరింది. బ్యారేజీ వద్ద ఈ బృందానికి సాదర స్వాగతం లభించింది. ఈ సందర్బంగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ, 1971 డిసెంబరు 16న పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి లభించిందని, ఆ విముక్తి సాధనలో భారత సైనికుల కీలక పాత్ర ఉందని గుర్తు చేశారు. తాము సికింద్రాబాద్‌ నుంచి సైకిల్‌ ర్యాలీ ప్రారంభించామని, గోల్కొండ, గద్వాల్‌, ఆదోని, విజయవాడ, ఖమ్మం, వరంగల్‌ మీదుగా తిరిగి సికింద్రాబాద్‌ చేరుకుంటామన్నారు.