Abn logo
Aug 4 2020 @ 22:01PM

అమిత్ షా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: భూటాన్ విదేశాంగ మంత్రి

థింపు (భూటాన్): ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరగా కోలుకోవాలని భూటాన్ విదేశాంగ మంత్రి తాండి దోర్జీ ఆకాంక్షించారు. ఇవాళ ట్విటర్ వేదికగా స్పందిస్తూ... ‘‘భారత హోంమంత్రి అమిత్ షాకి శుభం కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని కోరుకుంటున్నా...’’ అని దోర్జీ పేర్కొన్నారు. కాగా తాను కరోనా ఇన్ఫెక్షన్‌కి గురైనట్టు ఈ నెల 2న అమిత్ షా ట్విటర్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘‘స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నాను. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నా.. వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రిలో చేరుతున్నాను. ఇటీవల కాలంలో నాకు సమీపంగా మెలిగిన అందరూ క్వారంటైన్‌కు వెళ్లాలనీ.. వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను..’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. ఆయన ప్రస్తుతం గుర్గామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement